ఆకాశమే అందేలా!
‘ఆకాశమంత పందిరి.. భూదేవి అంత పీట..’ అంటుంటారు. నిజంగా ఆకాశమంత పందిరి వేయాలనుకుంటే మాత్రం కొకోరా లోయకు వెళ్లాల్సిందే! ఎందుకంటారా.. అక్కడే రెండువందల అడుగులకు మించి పెరిగే పామ్ జాతి చెట్లుంటాయి మరి! సాధారణంగా ఈ జాతి చెట్లు 50 అడుగుల పొడవుంటాయి అంతే! కానీ ఈ లోయలో మాత్రం ఇవి చాలా ఎత్తుకు పెరిగేస్తున్నాయి. ఇక ప్రపంచంలో మరెక్కడా ఇంత ఎత్తు పెరిగే పామ్ చెట్లు కనిపించవు.
కొలంబియాలో సముద్రమట్టానికి 5,900 అడుగుల ఎత్తులో కొకోరా లోయ ఉంది. చుట్టూ దట్టమైన అడవి. పచ్చని ప్రకృతి నడుమ పహరా కాస్తున్నట్టుగా వ్యాక్స్ పామ్ చెట్లుంటాయి. ఈ లోయకు మరో ప్రత్యేకతా ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా వర్షం పడుతుంది. అందుకే నేల ఎప్పుడూ తడిగా ఉంటుంది. పైగా ఆండీస్ పర్వతాల నుంచి వచ్చే గాలుల వల్ల వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఈ అనుకూల పరిస్థితుల వల్లే ఈ చెట్లు అంతెత్తుకు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వృక్షాలను ఇతర ప్రాంతాల్లో పెంచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి. అందుకే ఈ ప్రాంతం ఇంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.
జాతీయ వృక్షంగా..
అక్కడి ప్రభుత్వం కొకోరా లోయను 1985లో ‘లాస్ నెవాడోస్ నేషనల్ నేచురల్ పార్కు’లో భాగం చేసింది. వ్యాక్స్ పామ్‌ను జాతీయ వృక్షంగా ప్రకటించింది. ఈ చెట్లతో కూడిన లోయ చిత్రాలతో పోస్ట్ కార్డులు, స్టాంపులూ విడుదల చేసింది. ఈ ఉద్యానవనం విస్తీర్ణం 580 చదరపు కిలోమీటర్లు. ఏటా 1.5 లక్షల మంది ప్రపంచం నలుమూలల నుంచి ఈ వృక్షాలను చూసేందుకే వస్తుంటారు. ఇక్కడ అరుదైన పక్షులు, వన్యప్రాణులూ ఉన్నాయి.
ప్రతి భాగమూ ఉపయోగమే..
ఈ చెట్ల జీవితకాలం 120 ఏళ్ల పైమాటే! చెట్టులోని ప్రతి భాగాన్నీ స్థానికులు ఉపయోగించుకుంటారు. కాండాన్ని ఇల్లు, కంచెల నిర్మాణానికి, ఫర్నిచర్ తయారీ, విద్యుత్తు స్థంభాలుగానూ వాడతారు. ఆకుల మొదళ్ల నుంచి, కాండం నుంచి సేకరించిన మైనంతో కొవ్వొత్తులు తయారు చేస్తారు. వేడుకల్లో పందిళ్లు వేసేందుకు ఆకులు పనికొస్తాయి. అంత పెద్ద చెట్లను నరికేందుకు వీలుకాదు కదా! అందుకే చెట్టు పూర్తిగా ఎదగకముందే వాటిని కొట్టేస్తుంటారు. ఈ చెట్టు పండ్లు రాలి, విత్తనాలు మొలకెత్తక ముందే పశువులు తినేస్తుంటాయి. ఇలాంటి కారణాల వల్ల ఈ వృక్షాల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతోంది.
నేస్తాలూ ఇవీ.. మేఘాల్ని తాకే వ్యాక్స్ పామ్ చెట్టు సంగతులు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
GT vs CSK: రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ మిస్.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Politics News
Karnataka polls: ఎన్నికల వేళ జేడీఎస్‌కు షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా!
-
Movies News
SIR: ‘సార్’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!