మీకు మీరే.. మాకు మేమే..!
ప్రపంచం మొత్తాన్ని కరోనా చుట్టేస్తోంది. క్వారంటైన్, ఐసోలేషన్ అనే పదాలు మన జీవితంలో భాగమైపోయాయి. కానీ ఓ గ్రామానికి చెందిన వారు మాత్రం ఎన్నో ఏళ్లుగా ఐసోలేషన్‌లో ఉంటున్నారు. వీళ్లు బయటి వాళ్లను ఎవ్వరినీ తమ దగ్గరకు రానివ్వరు. వీరెవ్వరూ వారి దగ్గరకు వెళ్లరు. ప్రపంచంతో పనే లేదు. వీళ్ల ఊరే వీరికి ప్రపంచం!
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో పార్వతీవ్యాలీలో ఉందీ మలన గ్రామం. ఇది సముద్రమట్టానికి 8,701 అడుగుల ఎత్తులో చుట్టూ కొండల మధ్యలో ఉంది. ఇక్కడి ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తారు. వీళ్ల గ్రామ దేవత పేరు ‘జంబ్లూ’. ఇరుగుపొరుగు గ్రామాల వారితో పెళ్లి సంబంధాలు కలుపుకోరు. అంతెందుకు వాళ్ల ఊరు కాకుండా పక్క ఊరి వంటలను కూడా వీళ్లు ముట్టుకోరు. బయటి వ్యక్తులను తమ ఊరికి రానివ్వరు. వీళ్లు కూడా బయటి ఊళ్లకు వెళ్లరు. తమ జాతి కలుషితం కాకుండా ఉండటం కోసమే ఇదంతా అని చెబుతుంటారు.
విచిత్ర పేర్లు
వీళ్లు ప్రభుత్వంతో సంబంధం లేకుండా జీవిస్తారు. తమకు నచ్చినట్టుగా కట్టుబాట్లు, నియమాలు పెట్టుకుని వాటినే అనుసరిస్తారు. ఒక్క ప్రభుత్వ పాఠశాలను మాత్రమే వీళ్లు తమ ఊళ్లో అనుమతించారు. ఇక ఏవిధమైన సర్కారు జోక్యాన్నీ అస్సలు సహించరు. ఇక్కడి ప్రజలు కనషీ అనే భాష మాట్లాడతారు. ఈ ఊళ్లోని వాళ్లకు తప్ప ఇక ఎవరికీ ఇది అర్థం కాదు. ఇందులో సంస్కృత పదాలే ఎక్కువ. టిబెట్ భాష ప్రభావం కూడా కనిపిస్తుంది. తమ పిల్లలకు కూడా విభిన్నమైన పేర్లు పెడతారు. ఆదివారం పుడితే అహ్త, సోమవారం జన్మిస్తే సౌనరు, మంగళవారం అయితే మంగల్ ఇలా.. వాళ్లు పుట్టిన వారాన్ని బట్టి వాళ్లకు పేర్లుంటాయన్నమాట. అందుకే మలన గ్రామంలో ఒకే పేరున్న వ్యక్తులు చాలా మందే ఉంటారు.
ప్రకృతి అంటే ప్రాణం
వీళ్లు ప్రకృతి ఆరాధకులు. చెట్లను తమ కన్నబిడ్డల్లా చూసుకుంటారు. పచ్చని చెట్లను నరికితే ఇక్కడ నేరం. ఈ గ్రామంలో గంజాయి ఎక్కువగా పండిస్తారు. ఈ ఆకులతో ‘మలన క్రీం’ తయారు చేస్తారు. దీనికి కూడా మంచి గిరాకీ ఉంది. మొత్తానికి ఇక్కడివారు ‘మీకు మీరే.. మాకు మేమే’ అన్నట్లు బతికేస్తారు. పర్యాటకులు సందర్శించడానికి మాత్రం వీళ్లు షరతులతో కూడిన అనుమతులు ఇస్తారు. ఇవండీ మలన సంగతులు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sushil Modi: నా పిటిషన్‌పైనా రాహుల్‌కు శిక్షపడుతుందని ఆశిస్తున్నా.. సుశీల్ మోదీ
-
Sports News
IPL 2023: ఐపీఎల్లో ఏంటీ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్..?
-
Politics News
BJP vs Congress: ‘రాహుల్జీ మీకు ధన్యవాదాలు’.. జర్మనీపై దిగ్విజయ్ ట్వీట్‌కు భాజపా కౌంటర్!
-
Sports News
Best Fielder: ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్ ఫీల్డర్ అతడే: జాంటీ రోడ్స్
-
India News
Divya Spandana: అప్పుడు రాహులే నాకు మానసిక ధైర్యం ఇచ్చారు: నటి వ్యాఖ్యలు
-
Movies News
Pathu Thala: వారికి థియేటర్లోకి నో ఎంట్రీ.. వీడియో వైరల్..