ఇవేం ఇళ్లండీ బాబూ!
ఇక్కడున్నవన్నీ ఇళ్లే! ఏంటీ.. నమ్మకం కుదరట్లేదా? ఒకసారి మళ్లీ చూడండి.. మ్... ఇప్పుడు ఓకేనా! కానీ ఇవేంటీ మన ఇళ్లలా లేవు. ఏదో జాతరలో కనిపించే బొమ్మల్లా ఉన్నాయి. అక్కడంతా ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయనుకుంటే పొరపాటే. మరి అసలు విషయమేంటో మీరే చదవండి...
సాధారణంగా ఇంటి నిర్మాణంలో రకరకాల డిజైన్లు చూస్తుంటాం. గాజు, ఇటుక, చెక్క వంటి వాటితో కట్టుకుంటుంటారు. కానీ జర్మనీలోని నాన్డార్ఫ్ గ్రామానికి చెందిన స్టెఫెన్ మోడ్రాచ్ తాతయ్య కట్టిన ఇళ్లను చూస్తే మాత్రం ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటారా! ఆయన కట్టిన ఇళ్లలో అన్నీ మార్బుల్స్, రాళ్లు, గాజు ముక్కలుంటాయి.
పదేళ్లుగా ఇదే పనిలో...
ఈయన పదేళ్లుగా ఇలాంటి ఇళ్లను కట్టే పనిలో నిమగ్నమయ్యారట. కొత్తదనాన్ని వెతుకుతూ ఉంటే.. ఇది ఇంతటితో ఆగిపోదు అంటారు స్టెఫెన్ తాతయ్య. ఈయన రూపొందించే ప్రతి కళాకృతిలో వివిధ రకాలైన ముక్కలు రెండు కోట్ల దాకా ఉంటాయట. దీన్నే మొజాయిక్ టెక్నిక్ అంటారు. అంటే.. ఒక నిర్మాణంలోనే ఎన్నో రకాలైన వస్తువులను ఇమడ్చటమన్నమాట!
రెండు కళ్లూ చాలవు..
అంతేకాదండోయ్.. ఈయన కట్టిన ఇళ్లలో టవర్లు, రహస్య ద్వారాలు, కిటికీలు విభిన్నమైన ఆకృతుల్లో దర్శనమిస్తాయి. ఆయన్ను కలవడానికి వెళ్లిన వాళ్లకి ఆయన కట్టిన ఇళ్లంటినీ చూపిస్తాడు. అవన్నీ చూడటానికి రెండు కళ్లూ సరిపోవు తెలుసా! నిజానికి అవన్నీ చూస్తుంటే ఒక వింత లోకంలో విహరిస్తున్నట్లుగా ఉంటుందట. ఇదంతా వింటుంటే ఇవేం ఇళ్లండీ బాబూ! మేమెక్కడా చూడలేదే.. అనిపిస్తోంది కదూ!!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Best Fielder: ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్ ఫీల్డర్ అతడే: జాంటీ రోడ్స్
-
India News
Divya Spandana: అప్పుడు రాహులే నాకు మానసిక ధైర్యం ఇచ్చారు: నటి వ్యాఖ్యలు
-
Movies News
Pathu Thala: వారికి థియేటర్లోకి నో ఎంట్రీ.. వీడియో వైరల్..
-
Politics News
Bandi sanjay: కేసీఆర్ను రాష్ట్ర ప్రజలెందుకు భరించాలి? సహించాలి?: బండి సంజయ్
-
General News
Andhra News: పోలీసులకు ఎదురుదెబ్బ.. అంజన్ను విడుదల చేయాలని కోర్టు ఆదేశం
-
India News
Karnataka: భాజపా.. కాంగ్రెస్.. ముఖ్యమంత్రి ‘ముఖచిత్రం’ ఉంటుందా..?