భళా నమ్యా.. భలే తెలివి!
పదమూడేళ్ల నమ్యా జోషిది పంజాబ్ లోని లూదియానా. ఆమెకు వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం. మాకూ ఇష్టమే అని మీరంటారేమో...! కానీ మీకో విషయం తెలుసా.. ఆమె సొంతంగా ఆన్లైన్ వీడియో గేమ్స్ తయారు చేయగలదు. అంతేకాదు... ఏకంగా టీచర్లకే పాఠాలూ చెప్పేస్తోంది.
నమ్యా జోషి కంప్యూటర్‌లో ఆన్లైన్, వీడియో గేమ్స్ ఎంతో చక్కగా ఆడుతుంది. ఆ ఆసక్తే కొంచెం కొంచెంగా పెరిగి ఇప్పుడు తనే సరికొత్త గేమ్స్ తయారు చేసే స్థాయికి చేరుకుంది. గేమిఫికేషన్ సంబంధిత జాతీయ పోటీల్లోనూ ఈ చిన్నారి పాల్గొనేది. అలా గేమ్స్ మీదున్న ఇష్టమే ఇప్పుడు తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించేలా చేసింది.
ఈచ్ వన్.. టీచ్ టెన్..
యునెస్కో క్లబ్ వరల్డ్ వైడ్ యూత్ మల్టీమీడియా కాంపిటిషన్‌లో విజేతగా నిలిచింది. అందులో వర్చువల్ లైబ్రరీ ఆఫ్ బుక్స్‌ను రూపొందించి ఎస్‌డీజీ 2030కి అందించింది. తన ప్రాజెక్ట్ పేరు ‘ఈచ్ వన్, టీచ్ టెన్’. అది గేమ్‌కు సంబంధించింది. అందులో గేమ్‌తో పాటు పాఠాలు నేర్చుకోవచ్చు!
మైక్రోసాఫ్ట్ సీఈవో మెచ్చుకున్నారు
మైన్‌క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ ఎడిషన్, స్టెమ్‌లకు కోర్స్ మెటీరియల్ రూపొందించింది. దీంతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ చిన్నారిని అభినందించారు. అంతేకాదు.. 2019లో ఫిన్లాండ్ దేశం నిర్వహించిన ‘గేమిఫికేషన్ ఇన్ ఎడ్యుకేషన్’ కార్యక్రమంలో వక్తగా పాల్గొంది ఈ చిన్నారి. ఈ ఏడాది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్నోవేషన్’ విభాగంలో దక్కించుకుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Best Fielder: ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్ ఫీల్డర్ అతడే: జాంటీ రోడ్స్
-
India News
Divya Spandana: అప్పుడు రాహులే నాకు మానసిక ధైర్యం ఇచ్చారు: నటి వ్యాఖ్యలు
-
Movies News
Pathu Thala: వారికి థియేటర్లోకి నో ఎంట్రీ.. వీడియో వైరల్..
-
Politics News
Bandi sanjay: కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలెందుకు భరించాలి? సహించాలి?: బండి సంజయ్
-
General News
Andhra News: పోలీసులకు ఎదురుదెబ్బ.. అంజన్‌ను విడుదల చేయాలని కోర్టు ఆదేశం
-
India News
Karnataka: భాజపా.. కాంగ్రెస్.. ముఖ్యమంత్రి ‘ముఖచిత్రం’ ఉంటుందా..?