ఆడుకోవచ్చు.. రాసుకోవచ్చు..!

మీరు చాలా రకాల బొమ్మల పెన్నులు చూసే ఉంటారు కదూ నేస్తాలూ! ఇదిగో ఇది ఇంకోటి... దీని పేరు మాగ్నెటిక్‌ మెటల్‌ పెన్‌. దీంతో బొమ్మలు చేసుకోవచ్చు. మీరు సరిగానే చదివారు... బొమ్మలు

Published : 03 Jun 2021 00:09 IST

ఆటబొమ్మ

మీరు చాలా రకాల బొమ్మల పెన్నులు చూసే ఉంటారు కదూ నేస్తాలూ! ఇదిగో ఇది ఇంకోటి... దీని పేరు మాగ్నెటిక్‌ మెటల్‌ పెన్‌. దీంతో బొమ్మలు చేసుకోవచ్చు. మీరు సరిగానే చదివారు... బొమ్మలు వేసుకోవడం కాదు... చేసుకోవడమే! అందుకే దీన్ని ‘టాయ్‌ పెన్‌’ అంటారు. అంతేకాకుండా ఫోన్‌ లేదా ట్యాబ్‌ను ఉపయోగించేటప్పుడు టచ్‌ స్క్రీన్‌ మీద టచ్‌ చేయడానికీ, కాగితం మీద రాసుకోవడానికీ వాడుకోవచ్చు. కాబట్టి దీన్ని మల్టీ ఫంక్షన్‌ రైటింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ అనీ పిలుస్తారు. మనకు ఓపిక ఉండాలే కానీ... ఈ పెన్నును ఎన్ని రకాలుగా అయినా మార్చుకోవచ్చు. ఖడ్గం, రోబో, మాన్‌స్టర్‌ వంటి బొమ్మలనూ సులువుగా తయారు చేసుకోవచ్చు. ఇలా బొమ్మలు చేయడానికి ముందు పెన్నులోంచి రీఫిల్‌ మాత్రం తీసేయాల్సి ఉంటుంది. ఇది మన దగ్గర ఉంటే ఎంతసేపైనా కాలక్షేపం చేసేయొచ్చు. దీంతోపాటు రెండు రీఫిళ్లు, 13 మాగ్నెటిక్‌ రింగులు, 12 స్టీల్‌ బంతులు, గిఫ్ట్‌ బాక్సులూ వస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని