బెనిన్‌.. ఇదో కవలల దేశం!

నేస్తాలూ.. మీకు బెనిన్‌ తెలుసా..? అదో చిన్న దేశం. మనలో చాలా మంది ఇంతకు ముందు దాని పేరు కూడా విని ఉండరు. కానీ ఈ దేశానికో ప్రత్యేకత ఉంది. దీనికి కవలల దేశం అని పేరు. ప్రపంచంలో

Updated : 14 Jun 2021 01:21 IST

నేస్తాలూ.. మీకు బెనిన్‌ తెలుసా..? అదో చిన్న దేశం. మనలో చాలా మంది ఇంతకు ముందు దాని పేరు కూడా విని ఉండరు. కానీ ఈ దేశానికో ప్రత్యేకత ఉంది. దీనికి కవలల దేశం అని పేరు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇక్కడ పుట్టినంత మంది కవలలు పుట్టరట. భలే తమాషాగా
ఉంది కదూ..!
ఆ దేశం పేరు బెనిన్‌. ఆఫ్రికా ఖండంలో ఉందిది. ఈ దేశంలో ఎక్కడ చూసినా కవలలు ఎక్కువగా పుడుతున్నారు. ఇది గమనించిన పరిశోధకులు సర్వే చేస్తే ఆశ్చర్యపోయే విషయం తెలిసింది. అదేంటంటే.. ప్రపంచవ్యాప్త సగటు ప్రతి వెయ్యి మందికి 13.1 మంది పుడుతుంటే ఈ దేశంలో మాత్రం 27.9 మంది కవలలు పుడుతున్నారు. అదే కనుక మన ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాల్లో అయితే ఈ సంఖ్య కేవలం 9గానే ఉంది.

ఎందుకిలా?
ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటివరకూ తేలలేదు. పరిశోధకులు మాత్రం తినే తిండి బట్టి, అక్కడి వాతావరణం బట్టి అలా జరగొచ్చనే అభిప్రాయాలు చెబుతున్నారు కానీ సరైన కారణాలు మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే.. ఈ కవలలు కూడా బెనిన్‌, నైజీరియా, టోగో వంటి దేశాల్లో నివసించే యురూబా అనే తెగలోనే ఎక్కువగా పుడుతున్నారట. ఏదేమైనప్పటికీ కవలల దేశంగా బెనిన్‌ అందరికీ గుర్తుండిపోతుంది. అదన్నమాట సంగతి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని