నేనో నానో రూబిక్ క్యూబ్‌ను!
హాయ్.. నేస్తాలూ..! మీ అందరికీ రూబిక్ క్యూబ్ అంటే తెలిసే ఉంటుంది కదూ! మీరు చాలాసార్లు దాంతో ఆడుకునే ఉంటారు. లేదా.. కనీసం ఏ టీవీల్లోనో.. ఆఖరుకు గూగుల్‌లోనో చూసుంటారు. మామూలుగా అయితే అది అరచేతిలో పట్టేంత ఉంటుంది కదా! కానీ ప్రపంచంలోకెల్లా అతిచిన్న రూబిక్ క్యూబ్‌నైన నేను ఎంత ఉంటానో తెలుసా?!..
జపాన్‌కు చెందిన ఓ బొమ్మల తయారీ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన రూబిక్ క్యూబిక్‌నైన నన్ను తయారు చేసింది. నేను కేవలం 9.9 మిల్లీమీటర్లు ఉంటాను. బరువేమో రెండంటే రెండు గ్రాములంతే! పోస్టల్ స్టాంప్ మీద సరిగ్గా సరిపోతాను. నేను అంత చిన్నగా ఉంటానన్నమాట.
ధర ఘనం!
దాదాపు మీ షర్ట్ బటన్ అంత ఉండే నా ధర వింటే మాత్రం ‘అమ్మో.. అంతా.. మరీ ఎక్కువ!’ అని మీరు నోరెళ్లబెట్టేస్తారు. గత సంవత్సరం ఒకరు నన్ను లక్షా పదకొండువేల రూపాయలకు కొనుక్కున్నారు. మామూలుగా రూబిక్ క్యూబ్‌ను సాల్వ్ చేయడమే కష్టం అనుకుంటే.. నానో రూబిక్ క్యూబ్‌నైన నన్ను తయారు చేయడమూ కష్టమే. నా తయారీ కోసం ప్రత్యేక మెటీరియల్‌ను వాడారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా విని.. ఆ చోటా ఈ చోటా తెలుసుకుని నానో రూబిక్ క్యూబ్‌లు తమకూ కావాలని ఆ బొమ్మల తయారీ కంపెనీని సంప్రదిస్తున్నారు. మొత్తానికి ఇవీ నా విశేషాలు.
మీకు తెలుసా!
* మొట్టమొదటి సారిగా 1970లో హంగేరియన్ ఆర్కిటెక్చర్ ఎర్నో రూబిక్.. రూబిక్ క్యూబ్‌ను తయారు చేశాడు.
* ప్రజలకు 1974 నుంచి అందుబాటులోకి వచ్చింది.
* ఓ అమెరికా కంపెనీ 1980 నుంచి రూబిక్ క్యూబ్‌ను వాణిజ్యపరంగా పెద్దఎత్తున ఉత్పత్తి చేయడం ప్రారంభించింది.
* తర్వాత రెండు సంవత్సరాల్లో ఏకంగా 10 కోట్ల రూబిక్ క్యూబ్‌లు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యాయి.
* మొదటి ఎనిమిది నెలల్లో ఒక్క జపాన్‌లోనే దాదాపు 40 లక్షల రూబిక్ క్యూబ్‌లు అమ్ముడైపోయాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
SIR: ‘సార్’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!