ఆ బడికెళ్తే కళ్లు జిగేల్‌!

అనగనగా ఓ బడి.. అది మామూలు బడే... కానీ ఓ విషయం దాన్ని ప్రత్యేక బడిని చేసింది. అది ఏంటంటే... ఆశ, దోశ, అప్పడం, వడ.. ఇక్కడే తెలుసుకుందామనా? ఆ పప్పులేం ఉడకవు! కథనంలోకి వెళ్లాల్సిందే ఫ్రెండ్స్‌..

Published : 07 Dec 2021 00:23 IST

అనగనగా ఓ బడి.. అది మామూలు బడే... కానీ ఓ విషయం దాన్ని ప్రత్యేక బడిని చేసింది. అది ఏంటంటే... ఆశ, దోశ, అప్పడం, వడ.. ఇక్కడే తెలుసుకుందామనా? ఆ పప్పులేం ఉడకవు! కథనంలోకి వెళ్లాల్సిందే ఫ్రెండ్స్‌.. అప్పుడే మీకు అసలు విషయం తెలుస్తుంది!

ర్ణాటకలోని మంగళూరు శివార్లలో కైరంగలలో శారద గణపతి విద్యాకేంద్రం ఉంది. ఈ పాఠశాలలో ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కూడా కాదు... ఆఖరుకు నాలుగు కూడా కాదు నేస్తాలూ..! ఏకంగా 11 కవల జంటలున్నాయి. ఇందులో నాలుగు బాలుర, మూడు బాలికల, నాలుగు మిక్స్‌డ్‌ (బాలుడు, బాలిక) కవల జంటలున్నాయి. అందుకే ఈ బడికి ఎవరైనా కొత్త వారు వస్తే, ఈ కవలలను చూసి ఒక్కసారిగా అవాక్కవుతారు.

2008 నుంచే...

దు ఈ పాఠశాలకు ఏ ప్రత్యేకతా లేదు. ఇది కూడా సాదాసీదా బడే. 2008వ సంవత్సరం నుంచే ఈ బడిలో కవలలు చేరడం మొదలైంది. ఇలా ఇప్పటి వరకు కవల జంటల సంఖ్య 11కి చేరింది. వీరంతా నాలుగో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నారు. బడిలో ఒక్క జంట కవలలు ఉంటేనే మనం తెగ ఆశ్చర్యపోతాం. అలాంటిది ఈ బడిలో ఏకంగా 11 జంటల కవలలు ఉన్నారు. అందుకే ఈ పాఠశాలకు ‘కవలల బడి’ అనే పేరు కూడా వచ్చింది.

బడి పేరు కూడా...

ఈ పాఠశాలలో నాలుగో తరగతిలో మూడు, అయిదో తరగతిలో రెండు, ఆరు, ఏడు, ఎనిమిది, పదో తరగతుల్లో ఒక్కో జంట, 12వ తరగతిలో రెండు జంటల కవలలున్నారు. మరో గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ పాఠశాల పేరులోనూ ‘శారద- గణపతి’ అనే జంట పేర్లున్నాయి. విద్యకు సరస్వతీ దేవితోపాటు, గణపతిని కూడా ప్రతీకగా కొలుస్తుంటారు.

నేస్తాలూ! మొత్తానికి ఇవీ ఈ ‘కవలల బడి’ విశేషాలు. అన్నట్లు మీ బడిలో కానీ, మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా కవలలున్నారా?!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని