నేనే అందరికన్నా చిన్నోచ్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఎలా ఉన్నారు? బాగున్నారా?.. నేను అయితే చాలా బాగున్నాను. ఏంటి అలా చూస్తున్నారు! నేను ఎవరనా?! నేను ఓ వంతెనను. సాదాసీదా వంతెనను కాదు. ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన

Updated : 10 Apr 2022 01:17 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఎలా ఉన్నారు? బాగున్నారా?.. నేను అయితే చాలా బాగున్నాను. ఏంటి అలా చూస్తున్నారు! నేను ఎవరనా?! నేను ఓ వంతెనను. సాదాసీదా వంతెనను కాదు. ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన అంతర్జాతీయ వంతెనను. మరి నా సంగతులేంటో తెలుసుకుంటారా?

నేను అమెరికా, కెనడాల మధ్య ఉన్నాను. నేను ఓ అమెరికన్‌ ద్వీపాన్ని, కెనడియన్‌ ద్వీపాన్ని కలుపుతున్నాను. నా పొడవు కేవలం 32 అడుగులు. అమెరికా, కెనడా ఒప్పందం ప్రకారం జవికన్‌ ద్వీప సముదాయాన్ని రెండు దేశాలూ పంచుకున్నాయి. నేను ఓ రెండు దీవులను కలిపాను. ఇందులో ఒకటి అమెరికన్‌ దీవి, మరోటి కెనడియన్‌ దీవి.

ఇంటిని, పెరటినీ కలిపాను...
నేను కలిపిన రెండు ద్వీపాలూ ఒకరికి చెందినవే. ఇవి సెయింట్‌ లారెన్స్‌ నదిలో ఉన్నాయి. ఒక దీవిలో ఇల్లుంటే.. మరో దీవిలో పెరడుంది. ఇలా నేను ఒక దేశంలో ఉన్న ఇంటిని, మరో దేశంలో ఉన్న పెరటిని కలిపే వారధిగా మారాను అన్నమాట. మొత్తానికి ఇలా ప్రపంచంలోనే అతిచిన్న అంతర్జాతీయ వంతెనగా గుర్తింపు పొందాను. ఫ్రెండ్స్‌.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని