ఇదో ప్రత్యేక గ్రంథాలయం!

ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులు.. ఇతర పిల్లలతో పోల్చుకుంటే కాస్త నెమ్మదిగా ఉంటారు. ఆలస్యంగా నేర్చుకుంటారు. ప్రపంచ వేగంతో వాళ్లు పోటీ పడలేరు. ఇలాంటి పిల్లలే తమలాంటి వారికోసం ఓ గ్రంథాలయం నడుపుతున్నారు.

Updated : 24 Apr 2022 05:57 IST

ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులు.. ఇతర పిల్లలతో పోల్చుకుంటే కాస్త నెమ్మదిగా ఉంటారు. ఆలస్యంగా నేర్చుకుంటారు. ప్రపంచ వేగంతో వాళ్లు పోటీ పడలేరు. ఇలాంటి పిల్లలే తమలాంటి వారికోసం ఓ గ్రంథాలయం నడుపుతున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందామా మరి.

గుజరాత్‌ రాష్ట్రంలోని వడోదరలో ఓ స్వచ్ఛంద సంస్థవారు ఆటిజం పిల్లలకోసం  ప్రత్యేకంగా ఓ గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఇందులో కొన్ని పుస్తకాలు, వేల సంఖ్యలో ఫ్లాష్‌ కార్డులు, పిక్చర్‌కార్డులు అందుబాటులో పెట్టారు. ఇవి ఆటిజం పిల్లలు తేలికగా చదువుకునేలా ఉంటాయి. మరో విశేషం ఏంటంటే.. ఈ గ్రంథాలయ నిర్వహణ బాధ్యతలు ఆటిజం పిల్లలే చూసుకుంటున్నారు.

ప్రత్యేక శిక్షణతో..

గ్రంథాలయం నిర్వహణ పనులు చూసుకుంటున్న చిన్నారులు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. కంప్యూటర్‌ పరిజ్ఞానం మీద కూడా వీరికి అవగాహన ఉంది. వీళ్లకు కిచెన్‌, హౌస్‌కీపింగ్‌, ఆఫీస్‌, లైబ్రరీ స్కిల్స్‌లో ప్రత్యేక శిక్షణ సైతం ఇచ్చారు. ఈ గ్రంథాలయాన్ని కూడా ‘వరల్డ్‌ ఆటిజం అవేర్‌నెస్‌ డే’ సందర్భంగా ఏప్రిల్‌ 2వ తేదీన ప్రారంభించారు.

నిర్వహణలో సాయం..

ఈ లైబ్రరీ నిర్వహణలో ప్రస్తుతం 14 మంది విద్యార్థులు పాలుపంచుకుంటున్నారు. వీరికి సహాయకంగా కొంతమంది టీచర్లు, సిబ్బందీ ఉన్నారు. వీరు విద్యార్థులను పర్యవేక్షిస్తుంటారు. ఈ లైబ్రరీ ప్రస్తుతం వారంలో రెండు రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. మొత్తానికి ఇవీ ప్రత్యేక గ్రంథాలయం విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని