ఈ గొరిల్లా.. మామూలుది కాదు!
హాయ్ ఫ్రెండ్స్.. మనది కానీ స్నేహితులది కానీ పుట్టినరోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటాం కదూ! ఎంచక్కా ఆరోజు అందర్నీ ఆహ్వానించి, కేక్ కట్ చేసి.. సరదాగా గడపొచ్చని అనుకుంటాం. అలాగే, ఇటీవల ఓ గొరిల్లా కూడా దాని జన్మదినం సందర్భంగా కేక్ కోసింది. కానీ, దానికో విశేషం ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే చకచకా ఇది చదివేయండి మరి.
బెర్లిన్ జూలో ‘ఫటూ’ అనే పేరున్న గొరిల్లా ఇటీవల తన 65వ పుట్టినరోజు జరుపుకొంది. ‘మామూలే కదా’ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే, ప్రపంచంలోనే అత్యంత వృద్ధ గొరిల్లా ఇదేనట. అందుకే ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది ఫ్రెండ్స్.
సాధారణం కంటే రెట్టింపు
సాధారణంగా గొరిల్లాలు 35 నుంచి 40 ఏళ్ల వరకు బతుకుతాయట. ఈ ఫటూ మాత్రం దాదాపు రెట్టింపు సంవత్సరాలు బతికేస్తోందని జూ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచం మొత్తమ్మీద జీవించి ఉన్న గొరిల్లాల్లో పెద్ద వయసున్న దీని కోసం జూ సిబ్బంది ప్రత్యేకమైన కేకును రూపొందించారట. కింద మొత్తం బియ్యంతో తయారు చేసి.. దాని మీద కూరగాయ ముక్కలూ, క్యాబేజీ ఆకులూ, చెర్రీలూ, దానికిష్టమైన ఇతర పదార్థాలతో అలంకరించారు.
ఓ నావికుడి ద్వారా..
మొదట ఈ గొరిల్లాను ఓ నావికుడు ఉత్తర ఆఫ్రికా దేశం నుంచి ఫ్రాన్స్‌కు తీసుకువచ్చాడు. అక్కడ అతడు ఓ దుకాణంలో డబ్బులు కట్టలేక.. బదులుగా గొరిల్లాను ఇచ్చేశాడు. అలా ఆ దుకాణదారు నుంచి 1957లో అంటే రెండేళ్ల వయసున్నప్పుడు అది ఈ జూకి చేరిందట. వాతావరణ మార్పులు, వేట తదితర కారణాల వల్ల గొరిల్లాల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుండటంతో, జూ సిబ్బంది ఫటూని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో వైరల్
పుట్టినరోజు సందర్భంగా ఫటూ కేకు కోస్తున్న ఫొటోలతోపాటు వీడియోనూ జూ ప్రతినిధులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది. ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’ అధికార వెబ్‌సైట్‌లోనూ గొరిల్లా వివరాలను షేర్ చేశారు. వాటిని చూసిన నెటిజన్లూ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు జన్మదిన శుభాకాంక్షలు చెబుతుంటే.. మరికొందరేమో దాన్ని అంత బాగా చూసుకుంటున్న జూ బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. ఆలస్యంగానైనా మనమూ ఫటూకి బర్త్‌డే విషెస్ చెప్పేద్దామా ఫ్రెండ్స్!!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!
-
World News
ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ మాయం..ఎయిర్టాగ్తో నిందితుడిని గుర్తించిన ప్రయాణికుడు
-
Movies News
Jagapathi Babu: అడవిని తలపించే ఇల్లు.. జగపతి బాబు తల్లి జీవన విధానమిది
-
India News
Karnataka: ఎన్నికల వేళ.. ముఖ్యమంత్రి కారులో తనిఖీలు..!
-
India News
Smriti Irani: ఆ విషయం చెప్పడానికి నాకు 40 ఏళ్లు పట్టింది: స్మృతి ఇరానీ
-
Politics News
Guntur: తెనాలిలో వైకాపా అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి: ఆలపాటి రాజేంద్రప్రసాద్