Published : 16 May 2022 00:33 IST

పండు.. పండు.. ఇంతకీ ఇదేం పండు?!

ఆకారంలో మరుగుజ్జు గుమ్మడి.. రూపేమో కాస్త టమోటా.. స్టార్‌ఫ్రూట్‌ పోలికలు.. వాటర్‌ యాపిల్‌ నిగనిగలు.. ఇంతకీ ఇన్ని గుణాలున్న  ఈ పండు పేరేంటో తెలుసా?

ఎగినియా యునిఫ్లోరా.. దీని పేరు. పలకడానికి కష్టంగా ఉంది కదూ... దీన్ని సురినామ్‌ చెర్రీ అని కూడా పిలుస్తారు. మనమూ రెండోదే ఖాయం చేసుకుందాం. ఈ చెట్లు ఎక్కువగా దక్షిణ అమెరికా తూర్పు తీరం, ఫ్రెంచి గయానా, బ్రెజిల్, ఉరుగ్వే, పెరుగ్వే, అర్జెంటీనాలో కనిపిస్తుంటాయి. 

నెమ్మదిగా పెరుగుతుంది.. 

ఈ సురినామ్‌ చెర్రీ చెట్టు చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఇది 26 అడుగుల ఎత్తు వరకు చేరుకుంటుంది. ఈ చెట్టు ఆకులు చలికాలంలో ఆకుపచ్చ రంగు నుంచి ఎరుపురంగులోకి మారతాయి. ఈ చెట్టు తెల్లని పూలను పూస్తుంది. ఆ పూలు సురినామ్‌ చెర్రీలుగా మారతాయి. ఒక్కో పండు 2 నుంచి 4 సెంటీమీటర్లు ఉంటుందంతే. పండు ముందు ఆకుపచ్చ రంగులో ఉండి.. తర్వాత పసుపు, ఆరెంజ్, మెరూన్, ఎరుపు రంగులోకి మారుతుంది. 

రుచి తీపి..

ఈ సురినామ్‌ చెర్రీలు తియ్యగా ఉంటాయి. పండక ముందు మాత్రం చాలా పుల్లగా ఉంటాయి. ఈ పండ్లను ఎక్కువగా జామ్‌లు, జెల్లీల తయారీలో వాడతారు. ఈ పండులో ఎక్కువగా విటమిన్‌-సి, విటమిన్‌-ఎ ఉంటుంది. 

తింటే ఎంతో మేలు

ఈ పండు గుండెకు ఎంతో మేలు చేస్తుంది. క్యాన్సర్ల నుంచి కాపాడుతుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. జలుబు నుంచి కూడా కాపాడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. శరీరం నుంచి మలినాలను తొలగిస్తుంది. ఇమ్యూనిటీ పవర్‌ను కూడా పెంచుతుంది. మరో విషయం ఏంటంటే.. సురినామ్‌ పేరుతో దక్షిణ అమెరికాలో ఓ దేశం కూడా ఉంది తెలుసా! మొత్తానికి ఇవీ ఈ పండు విశేషాలు ఫ్రెండ్స్‌.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు