నవ్వుల్‌.. నవ్వుల్‌..!

గిరి : హరీ.. మీ పిల్లి భలే ముద్దుగా ఉంది. ఏం పేరు?

Published : 04 Jun 2022 02:35 IST

మ్యావ్‌.. మ్యావ్‌..

గిరి : హరీ.. మీ పిల్లి భలే ముద్దుగా ఉంది. ఏం పేరు?
హరి : జుంజూ.. మీ ఇంట్లో కూడా ఒక పిల్లి ఉంది కదా!

గిరి : హ.. ఉంది.
హరి : దాని పేరేంటి మరి?

గిరి : మ్యావ్‌ మ్యావ్‌ రా..
హరి : అదేంటి..?

గిరి : ఏమోరా.. మా పిల్లిని ‘నీ పేరేంటి’ అని ఎన్నిసార్లు అడిగినా.. ‘మ్యావ్‌ మ్యావ్‌’ అనే అంటోంది మరి..
హరి : ఆ..!!

ఎంత ప్రేమో!

రాహుల్‌ : ఏంటి మావయ్యా.. నీరసంగా కూర్చున్నావు?
మావయ్య : ఏం లేదురా.. మీ అత్తయ్య కాఫీ ఇవ్వమంటే చల్లారింది తీసుకొచ్చింది..
రాహుల్‌ : ఫీలవ్వకు మావయ్య.. నీకోసం సాయంత్రం వేడి వేడి జ్యూస్‌ తీసుకొస్తాలే..

మక్కీకి మక్కీ

నాన్న : రిమ్మీ.. పక్కింటి జిమ్మీ కంటే నీకు తక్కువ మార్కులు వచ్చాయెందుకు?
రిమ్మి : అంతా మా టీచర్‌ తప్పే నాన్నా..

నాన్న : ఎందుకలా?
రిమ్మి : పరీక్షలో నా ముందే కూర్చున్న జిమ్మీ సమాధానాలన్నింటినీ అక్షరం తేడా లేకుండా కాపీ కొట్టా.. తనకేమో వందకి 90 వస్తే, నాకేమో నలభయ్యే వచ్చాయి. అంటే, టీచర్‌ కరెక్షన్‌ ఫాల్ట్‌ అన్నట్లే కదా నాన్నా..

నాన్న : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని