మనుషులే.. మొసళ్లుగా..!
హాయ్ ఫ్రెండ్స్.. ‘మొసళ్ల నడక’ గురించి విన్నారా? - ‘మొసలి కన్నీరు’ విని ఉంటాం కానీ ఈ ‘మొసళ్ల నడక’ ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదూ! చైనాలో ఈ మధ్య పాపులరైన ఈ కొత్తరకం ఎక్సర్‌సైజ్ గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. మరి ఇంకెందుకు ఆలస్యం.. గబగబా చదివేయండి మరి..
దాదాపు వెయ్యి మంది వరకూ యూనిఫాం మాదిరి డ్రెస్ వేసుకొని, ఆరోగ్యకర నినాదాలు చేసుకుంటూ.. ఓ పెద్ద కొండవైపు వెళ్తున్నారు. అలాగని వారందరూ పర్యాటకులు అనుకుంటే పొరపాటే. ఆ జట్టు మొత్తం వెళ్లేది ‘క్రొకొడైల్ క్రాలింగ్’ కోసం. అంటే.. మొసళ్లలా పాకుతూ, ఎక్సర్‌సైజ్ చేసేందుకన్నమాట.
పెరుగుతున్న సంఖ్య
చైనాలోని కొన్ని ప్రధాన నగరాల్లో ‘క్రొకొడైల్ క్రాలింగ్’ ఎక్సర్‌సైజ్ ప్రస్తుతం క్రేజీగా మారింది. యువత నుంచి మధ్యవయస్కుల దాకా దీనిపట్ల ఆసక్తి చూపుతున్నారు. ఎందుకూ అంటే.. ఈ వ్యాయామం నడుం నొప్పిని తగ్గించడంతోపాటు కండరాలను బలంగా చేస్తుందట. మొదట్లో ఒకరిద్దరితో మొదలైన ఈ ఎక్సర్‌సైజ్‌కు ప్రస్తుతం వేలాది మంది మొగ్గు చూపుతున్నారు. ఔత్సాహికులు యూనిఫాం మాదిరి ఒకేరకమైన డ్రెస్ వేసుకొని, కాళ్లూ చేతులూ ఉపయోగించి వాకింగ్ ట్రాక్ మీదుగా మొసళ్ల మాదిరి పాకుతూ కొండపైకి చేరుకుంటారట.
అందరికీ కాదు..
ఇదేదో బాగుంది కదా అని అందరూ చేయొచ్చని అనుకోకండి ఫ్రెండ్స్. డయాబెటిస్, బీపీ, గుండె సమస్యలు ఉన్నవారు ఈ ఎక్సర్‌సైజ్‌ను అస్సలు చేయకూడదట. ఎందుకంటే.. ఈ వ్యాయామం చేసే క్రమంలో రక్తప్రసరణ అధికం అవుతుందట. దాంతో గుండెకు సరఫరా పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎనిమిది నెలల నుంచి ఈ క్రాలింగ్‌ను ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తే.. ఇప్పుడు అక్కడి బృందాలకు సారథ్యం వహిస్తున్నారట. తన వెన్ను నొప్పి తగ్గిపోవడంతో.. దీన్ని అందరికీ పరిచయం చేస్తున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ముందుకు వెళ్తూ పుష్-అప్స్ చేయడం. అలా చేస్తున్న క్రమంలో అరచేతులకు గాయాలు కాకుండా.. గ్లవ్స్ వేసుకోవడం తదితర జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ వ్యాయామంతో వెన్నెముకలోని డిస్కుల కదలిక సులభమవుతుందని ఓ వైద్యుడు చెబుతున్నారు. ఇప్పుడీ ఎక్సర్‌సైజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. చైనా అంటేనే అంత కదా నేస్తాలూ.. తక్కువ ధరలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులైనా, ముక్కున వేలేసుకునేలా చేసే ఇలాంటి ప్రయోగాలన్నా దానికదే సాటి. మీరు మాత్రం సొంతంగా ఇలాంటి ఫీట్లు చేయకండి ఫ్రెండ్స్.. సరేనా!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!
-
World News
Rishi Sunak: సునాక్ మీరు బిలియనీరా..? బ్రిటన్ ప్రధాని సమాధానమిదే..
-
Sports News
IND vs AUS: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ.. అగ్గి రాజేశారు.. వారికి ఇది అలవాటే: అశ్విన్
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పుర్‌కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
Sports News
Asia Cup 2023: ఆసియా కప్ 2023.. నిర్వహణ ఎక్కడో రేపే తేలనుందా..?
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!