పార్క్ కాని పార్క్!
నేస్తాలూ.. అదో పార్క్.. అంటే ఆడుకునే పార్క్ అనుకునేరు. అది డైనోసర్ల పార్క్. ‘అదేంటి?. డైనోసర్లు ఎప్పుడో అంతరించిపోయాయి కదా? వాటికి పార్క్ ఏంటి?’ అని ఆలోచిస్తున్నారు కదూ! అయితే ఇంకెందుకాలస్యం. ఈ కథనం చదివేయండి.
ఈ డైనోసర్ల పార్క్ ఎక్కడో విదేశాల్లో కాదు.. మన దేశంలోనే ఉంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో బాలాసినోర్ అనే గ్రామం ఉంది. ఇక్కడే డైనోసర్ ఫాజిల్ పార్క్ ఉంది. ఫాజిల్స్ అంటే మీకు తెలుసు కదా నేస్తాలు. ప్రాచీనకాలం నాటి జీవుల శరీరాలు శిలలుగా రూపాంతరం చెంది ఉంటాయి. వీటినే శిలాజాలు అంటారు.
అప్పట్లో ఈ ప్రాంతంలో...
ఇక్కడ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం డైనోసర్లు జీవించేవి. శాస్త్రవేత్తల పరిశీలనలో అప్పట్లో ఈ ప్రాంతంలో దాదాపు 13 జాతుల డైనోసర్లు జీవించినట్లు తేలింది. పరిశోధకులకు ఇప్పటి వరకు ఇక్కడ సుమారు పది వేలకు పైగా డైనోసర్ల గుడ్ల శిలాజాలు దొరికాయి.
తొలిసారిగా..
1981లో తొలిసారిగా పరిశోధకులకు ఇక్కడికి సమీపంలోని రయోలీ అనే గ్రామంలో డైనోసర్ల శిలాజాలు దొరికాయి. అప్పటి నుంచి ఈ చుట్టుపక్కల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. శిలాజాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో 2007లో ఓ కొత్త రకం డైనోసర్ శిలాజాలు దొరికాయి. దానికి ‘రాజాసరస్ నర్మడెన్సిస్’ అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన కొన్ని అవశేషాలు నర్మదా నది తీరంలో దొరికాయి. అందుకే దీనికి ‘నర్మడెన్సిస్’ అనే పదాన్ని కూడా చేర్చారట.
పెద్ద సంఖ్యలో...
తవ్వకాల్లో కేవలం డైనోసర్ల శిలాజాలే కాకుండా పెద్ద ఎత్తున వాటి గుడ్ల శిలాజాలూ దొరికాయి. ఈ ప్రాంతం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద డైనోసర్ హాచరీగా పేరుగాంచింది. మొదట్లో గ్రామస్థులు ఈ డైనోసర్ల గుడ్లకు పూజలూ చేశారు. ఇక్కడ సుమారు 13 జాతుల డైనోసర్ల శిలాజాలు దొరికాయి. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇంకెక్కడా ఒకే చోట ఇన్ని జాతుల డైనోసర్ల శిలాజాలు లభ్యం కాలేదు. వీటి నమూనాలు, శిలాజాలతో ఇక్కడ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ డైనోసర్ ఫాజిల్ పార్క్ విశేషాలు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!
-
World News
Rishi Sunak: సునాక్ మీరు బిలియనీరా..? బ్రిటన్ ప్రధాని సమాధానమిదే..
-
Sports News
IND vs AUS: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ.. అగ్గి రాజేశారు.. వారికి ఇది అలవాటే: అశ్విన్
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పుర్‌కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
Sports News
Asia Cup 2023: ఆసియా కప్ 2023.. నిర్వహణ ఎక్కడో రేపే తేలనుందా..?
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!