అట్ట కొద్దీ ఫర్నిచర్!
మామూలుగా ‘పిండి కొద్దీ రొట్టె’ అంటారు కదా.. ‘మరేంటి.. అట్ట కొద్దీ ఫర్నిచర్ అంటున్నారు?’ అని ఆశ్చర్యపోతున్నారు కదూ! మరి ఈ ఫర్నిచర్ అంతా అట్టముక్కలతో తయారైంది. ఇదంతా ఎక్కడో విదేశాల్లో అనుకునేరు.. మన దేశంలోనే. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా.
ఫ్రెండ్స్.. మహారాష్ట్రలోని ముంబయికి చెందిన హరీష్ మెహతా అంకుల్ కార్డ్‌బోర్డ్‌తో ఫర్నిచర్ తయారీ కంపెనీ నిర్వహిస్తున్నారు. కర్ర, ఇనుము, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఈ కార్డ్బోర్డ్ ఫర్నిచర్‌ను వాడుకోవచ్చు. ఈ అట్టముక్కలతో తయారైన ఫర్నిచర్‌తో ప్రకృతికి చాలా మేలు. ఎందుకంటే ఇవి చాలా తేలికగా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నుతాయి. తర్వాత రీసైకిల్ కూడా చేసుకోవచ్చు. దాదాపు ఏడు సంవత్సరాల వరకు మన్నికగా ఉంటాయి.
కాస్త ప్రత్యేకంగా...
ఫర్నిచర్ తయారీకి వాడే ఈ కార్డ్బోర్డ్ కాస్త ప్రత్యేకమైంది. ఇది చాలా తేలికగా ఉండి.. ఎక్కువ బరువుల్ని మోస్తుంది. మన్నిక కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కార్డ్‌బోర్డ్‌తో కుర్చీలు, బల్లలు, పీటలు, మంచాలు, సోఫాసెట్లు, మ్యాగజైన్, సీడీ, బుక్ ర్యాక్‌లు, చెత్తబుట్టలు, టేబుల్ ల్యాంప్‌లు, అలంకరణ వస్తువులు.. ఇలా ప్రతిదీ తయారు చేస్తున్నారు. ఇవి చక్కని రంగుల్లో ఉండటంతో పిల్లల్ని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
చాలా తేలిక..
కార్డు బోర్డుతో తయారైన అచ్చులను చాలా తేలికగా, పిల్లలు సైతం అమర్చుకోవచ్చు. వీటి వల్ల పిల్లలకు గాయాలూ కావు. 2010లో హరీష్ అంకుల్ వాళ్ల కొడుకు పెళ్లి చేశారు. ఆ వేడుకలో కుర్చీలు, బల్లలు, అలంకరణ దీపాలు ఇలా అన్నీ కార్డ్బోర్డుతోనే తయారు చేశారట. అప్పట్లో ఇది వార్తల్లోకి ఎక్కింది. అప్పుడు వాడిన ఫర్నిచర్లో చాలా వరకు ఇప్పటికీ బాగానే ఉందట.
లూ - బాక్స్...
కేవలం ఫర్నిచరే కాకుండా మన హరీష్ అంకుల్ లూ- బాక్స్‌ను కూడా కార్డ్బోర్డ్తోనే తయారు చేశారు. ఇంతకీ ఇది ఏంటంటే ఇది పోర్టబుల్ టాయ్‌లెట్. లద్దాఖ్ లాంటి ప్రాంతాల్లో మహిళలు బహిరంగ మలమూత్ర విసర్జనకు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ అంకుల్ చెవిన పడింది. అందుకే వాళ్లు వాడుకునేందుకు వీలుగా కార్డ్‌బోర్డ్‌తో పోర్టబుల్ టాయ్‌లెట్‌ను తయారు చేశారు. కేవలం పది సెకన్లలోనే కార్డ్బోర్డ్ సెట్‌తో టాయ్‌లెట్‌ను ఏర్పాటు చేయగలగడం దీని ప్రత్యేకత.
చిన్నారులకు ఎంతో ఇష్టం..
ఈ కార్డ్బోర్డ్ ఫర్నిచర్ చిన్నారులకు ఎంతో నచ్చుతోంది. అందుకే ఇళ్లల్లో, ప్లేస్కూళ్లలో దీన్నే ఎక్కువగా వాడుతున్నారు. అన్నట్లు మన హరీష్ అంకుల్‌కు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే వాళ్లు ఆడుకునేందుకు వీలుగా కార్డ్‌బోర్డ్‌తో ఓ పడవను కూడా తయారు చేశారు. ఇందులో చిన్నపిల్లలు ఒకరు కూర్చొని హాయిగా నడిపించొచ్చట. మొత్తానికి కార్డ్బోర్డ్ ఫర్నిచర్ సంగతులు భలే ఉన్నాయి కదూ!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!
-
World News
Rishi Sunak: సునాక్ మీరు బిలియనీరా..? బ్రిటన్ ప్రధాని సమాధానమిదే..
-
Sports News
IND vs AUS: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ.. అగ్గి రాజేశారు.. వారికి ఇది అలవాటే: అశ్విన్
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పుర్‌కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
Sports News
Asia Cup 2023: ఆసియా కప్ 2023.. నిర్వహణ ఎక్కడో రేపే తేలనుందా..?
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!