ఈ ఇల్లు బంగారం కానూ..!
హాయ్ ఫ్రెండ్స్.. కొన్ని గుడుల గర్భాలాయాలకు బంగారు పూత పూయడం చూసే ఉంటారు. మిఠాయి దుకాణాల్లో కొన్ని స్వీట్లపైన వెండి రేకుల్లాంటివి కూడా గమనించే ఉంటారు. అలాగే, ఓ వ్యక్తి కూడా తన ఇంటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని అనుకున్నాడు. ఆ ఆలోచనలకు తగినట్లుగా.. మూడేళ్లలోనే దాన్నో పర్యాటక ప్రాంతంగా మార్చేశాడు. ఇంతకీ ఆ ఇంటి విశేషాలేంటో తెలుసుకుందామా..!
వియత్నాంకు చెందిన వాన్ట్రంగ్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన తన వ్యాపార పనుల నిమిత్తం దేశవిదేశాలూ తిరుగుతుండేవాడు. అలా కొన్నాళ్ల తర్వాత.. స్వదేశంలోనే స్థిరపడాలని నిశ్చయించుకున్నాడు. దాంతోపాటు తాను ఉండబోయే ఇంటిని ప్రత్యేకంగా నిర్మించాలనుకున్నాడు. కొందరు ఇంటీరియర్ డిజైనర్లతో మాట్లాడి.. రకరకాల ఆలోచనలు చేశాడు. చివరకు ఇంటి బయటా, లోపలా బంగారు పూత పూసినట్లు కనిపించేలా రూపొందించాలని నిర్ణయించుకున్నాడు.
మూడేళ్లు పట్టింది..
ఆరేళ్ల క్రితం వాన్ట్రంగ్కు వచ్చిన ఆలోచనకు కార్యరూపం తీసుకొచ్చేందుకు దాదాపు మూడేళ్లు పట్టింది. మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించి, దాని లోపలా, బయటా మొత్తం బంగారం పూతలాంటి పెయింటింగ్ వేయించాడు. అంతేకాదు.. లోపలి వస్తువులు, సామగ్రిని సైతం అలాగే తీర్చిదిద్దాడు. బయటి వారెవరైనా సరే.. ఆ ఇంటిని చూస్తే కచ్చితంగా బంగారంతోనో, బంగారు పూతతోనో నిర్మించారనే అనుకొంటారు.
పర్యాటక ప్రాంతంగా..
అలా కొద్దిరోజులకు ఆ ఇల్లు పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని అనుకున్న ఆ యజమాని.. ఇంటిని చూసేందుకు దాదాపు రూ.400 ఎంట్రీ ఫీజుగా నిర్ణయించాడు. అంతేకాదు నేస్తాలూ.. పర్యాటకుల ఆహార అవసరాలు తీర్చేందుకు, ఆ ఇంటి పక్కనే ఓ కెఫెను కూడా తెరిచాడు. గేట్ల నుంచి గోడల వరకూ, లైట్ల నుంచి వంట సామగ్రి వరకూ మొత్తం తళతళ మెరిసిపోతుంటే.. వాటిని చూసేందుకు రెండు కళ్లూ చాలవని పర్యాటకులు ఆశ్చర్యపోతూ చెబుతున్నారు. ఇవీ ఫ్రెండ్స్.. ఈ మెరుపుల ఇంటి విశేషాలు.!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: మా భూమిని లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటా..సెల్ఫీ వీడియో తీసి యువరైతు అదృశ్యం
-
Ap-top-news News
Andhra News: భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ఒబెరాయ్ సంస్థకు 40 ఎకరాలు!
-
Ap-top-news News
Vande Bharat Express: ‘వందే భారత్’ వచ్చినప్పుడే కాపలానా?
-
Ap-top-news News
రుషికొండపై వేంగి బ్లాక్ పూర్తికి టెండర్లు.. అక్కడే సీఎం క్యాంపు కార్యాలయం!
-
World News
US-China: 2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం?
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)