అయ్య బాబోయ్.. నాకు సిగ్గెక్కువ!
హాయ్ నేస్తాలూ.. ఎలా ఉన్నారు? బాగున్నారా? ‘ఇంతకీ నువ్వెవరు?’ ఇదేగా మీరు అడగాలి అనుకుంటోంది! నేనో పక్షిని. నాకు కాస్త సిగ్గెక్కువ. చూడ్డానికి కాస్త కోడిలా ఉన్నాను కదూ! మరి నా గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందా? అందుకే నేను... ఇదిగో ఇలా వచ్చాను.
ఇంతకీ మీకు నా పేరు చెప్పనేలేదు కదూ! నన్ను వెస్ట్రన్ ట్రాగోపన్ అని పిలుస్తారు. నేను హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాను. కైబర్‌లోయలో, ఉత్తరాఖండ్, ఉత్తర పాకిస్థాన్‌లో జీవిస్తాను. భారత ప్రభుత్వం నా చిత్రంతో తపాలా బిళ్లను సైతం విడుదల చేసింది. మీకో విషయం తెలుసా నేను అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాను.
మా బరువెంతో తెలుసా?
మాలో మగవాటి బరువు 1.8 కిలోల నుంచి 2.2 కిలోల వరకు ఉంటుంది. ఆడవేమో 1.25 నుంచి 1.4 కిలోల వరకు ఉంటాయి. మగవేమో 55 నుంచి 60 సెంటీమీటర్ల వరకు ఉంటే, ఆడవి 48 నుంచి 50 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. మేం ఎక్కువగా చెట్లపైనే నివసిస్తాం. కానీ మా ఆహారాన్ని మాత్రం నేల మీద నుంచే తీసుకుంటాం. ఇంతకీ మేం ఏం తింటామో తెలుసా... ఆకులు, మొలకలు, విత్తనాలు. అలాగని, శాకాహారులమని అనుకునేరు. మేం చిన్న చిన్న పురుగుల్ని కూడా తిని మా బొజ్జ నింపుకొంటాం.
చాలా చాలా.. తక్కువ...
ప్రపంచం మొత్తం మీద మా సంఖ్య కేవలం అయిదువేలు మాత్రమే. ఇది చాలా చాలా.. తక్కువ. అందుకే మేం అంతరించిపోయే జీవుల జాబితాలో ఉన్నాం. 2012లో అయితే కేవలం 20 మాత్రమే మా వెస్ట్రన్ ట్రాగోపన్‌లు హిమాచల్‌ప్రదేశ్‌లో కనిపించాయట. అన్నట్లు మాకు చాలా సిగ్గెక్కువ. మనుషులు కనిపిస్తే చాలు దూరంగా పారిపోతాం. కేవలం మనుషులే కాదు, ఇతర జీవులు కనిపించినా మేం దాక్కుంటాం. మా జీవిత కాలం కూడా చాలా తక్కువ. కేవలం మూడు సంవత్సరాల వరకు మాత్రమే జీవిస్తాం. మా సంఖ్య చాలా చాలా తక్కువగా ఉండటానికి ఇది కూడా ఓ కారణమే.
పెద్దగా ఎగరలేం...
మేం కాస్త మీ కోళ్లలానే ఉన్నాం కదూ! అచ్చం వాటిలానే మేం ఎగరలేం. కానీ చెట్టు మీదకో, చెట్టు మీద నుంచి కిందకో మాత్రం రెక్కలు ఆడిస్తూ దూకగలం. మేం బరువు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. నేస్తాలూ! మొత్తానికి ఇవే నా గురించి విశేషాలు. ఎందుకంటే నేను కనిపించడమే చాలా చాలా అరుదు కాబట్టి ఇంతకంటే ఎక్కువ వివరాలు మీకు నా గురించి తెలియదు. సరే ఇక ఉంటా మరి. బై.. బై..!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sushil Modi: నా పిటిషన్‌పైనా రాహుల్‌కు శిక్షపడుతుందని ఆశిస్తున్నా.. సుశీల్ మోదీ
-
Sports News
IPL 2023: ఐపీఎల్లో ఏంటీ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్..?
-
Politics News
BJP vs Congress: ‘రాహుల్జీ మీకు ధన్యవాదాలు’.. జర్మనీపై దిగ్విజయ్ ట్వీట్‌కు భాజపా కౌంటర్!
-
Sports News
Best Fielder: ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్ ఫీల్డర్ అతడే: జాంటీ రోడ్స్
-
India News
Divya Spandana: అప్పుడు రాహులే నాకు మానసిక ధైర్యం ఇచ్చారు: నటి వ్యాఖ్యలు
-
Movies News
Pathu Thala: వారికి థియేటర్లోకి నో ఎంట్రీ.. వీడియో వైరల్..