ప్చ్... నే పాట మరిచా!
హాయ్ నేస్తాలూ... మీకు ఇల్లు అలుకుతూ పేరు మరిచిపోయిన ఈగ గురించి తెలిసే ఉంటుంది. తెలియకుంటే మీ అమ్మానాన్నను అడగండి. వాళ్లకు మాత్రం కచ్చితంగా తెలిసే ఉంటుంది. అసలు ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే... ఈ కథనం చదివేయండి మీకే తెలుస్తుంది.
ఫ్రెండ్స్... నేనో బుజ్జి పిట్టను. బుల్లి పిట్టను. నా పేరేంటంటే.. రీజెంట్ హనీఈటర్. నన్ను మీరు చూసి ఉండరు. ఎందుకంటే నేను ఉండేది ఆస్ట్రేలియాలో. అది కూడా కేవలం ఆగ్నేయ ప్రాంతంలోనే ఉంటాను. నేను చాలా అరుదైన పక్షిని. ప్రపంచం మొత్తం మీద మేం ప్రస్తుతం కేవలం 300 వరకు మాత్రమే ఉన్నామని అంచనా. మా సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. మేం దాదాపు అంతరించిపోతున్న జీవుల జాబితాలోకి చేరిపోయాం.
మీ కోకిలమ్మలా...
నేను గుప్పెడంత పిట్టనే కానీ.. మీ కోకిలమ్మలానే చక్కగా పాడగలను. కానీ ఇప్పుడు పాడటం లేదు. ఎందుకో తెలుసా... మర్చిపోయాను. అవును నిజంగా నిజం! మా పక్షులు పాడే పాటలు ఎలా పాడాలో తెలియడం లేదు. అందుకే వేరే పక్షుల పాటలు పాడుతున్నాం. మా సంఖ్య చాలా చాలా తక్కువ ఉండటం వల్ల మా జాతి పక్షుల్లాగా ఎలా పాడాలో నేర్చుకునే అవకాశం కూడా మాకు దొరకడం లేదు. అందుకే కొంతమంది శాస్త్రవేత్తలు మా పాటను సంరక్షించే పనిలో పడ్డారు. మా పక్షుల్లో కొన్నింటిని పట్టుకుని, వాటికి మా పూర్వీకులు పాడిన పాటలను నేర్పించే పనిలో పడ్డారు. అంటే మీలా మాకూ ట్యూషన్ చెబుతున్నారనుకోండి. మాలో కొన్ని పక్షులకు మాత్రమే, అంటే దాదాపు 12 శాతానికి మాత్రమే మా పాటలు వస్తున్నాయట. అందుకే మాలో మిగిలిన పక్షులకూ ఆ పాటలు నేర్పించాలనే ఉద్దేశంతో వాటిని రికార్డు చేసి మాకు వినిపిస్తున్నారు. మేమూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం.
బుజ్జి బుజ్జి పిట్టలం!
మేం చాలా చిన్న పక్షులం. కేవలం 35 నుంచి 50 గ్రాముల బరువు ఉంటామంతే. మా తల, మెడ, గొంతు, నల్లగా ఉంటుంది. తెల్లని చుక్కలూ ఉంటాయి. రెక్కల్లో కొంతభాగం, తోక పసుపు రంగులో ఉంటుంది. మాలో ఆడవి రెండు లేదా మూడు గుడ్లు పెడతాయి. 14 రోజులు పొదిగిన తర్వాత అందులోంచి పిల్లలు బయటకు వస్తాయి.
పర్యావరణ మార్పులే కారణం...
మా సంఖ్య వేగంగా తగ్గిపోవడానికి, మేం అంతరించిపోయే ప్రమాదంలో పడటానికి పర్యావరణ మార్పులే కారణం. ఇష్టారీతిన అడవులను నాశనం చేయడమూ ఓ కారణమే. అంటే.. మేం పాట మర్చిపోవడానికి కూడా ఓ రకంగా మీరే కారణం!.. నేస్తాలూ.. ఇక ఉంటామరి.. నేను నా పాట నేర్చుకునే సమయమైంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: ఎంఎస్ ధోనీకిదే చివరి సీజనా..? రోహిత్ సూపర్ ఆన్సర్
-
Politics News
Chandrababu: చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది: చంద్రబాబు
-
Movies News
Mahesh Babu: సోషల్ మీడియాలో మహేశ్ రికార్డు.. ఫస్ట్ సౌత్ ఇండియన్ హీరోగా!
-
Politics News
TDP: ఎన్టీఆర్కు మరణం లేదు.. నిత్యం వెలిగే మహోన్నత దీపం: బాలకృష్ణ
-
World News
Mummified Body: తల్లి మృతదేహాన్ని భద్రపరచి.. 13ఏళ్లుగా సోఫాలోనే ఉంచి..!
-
Sports News
Virat Kohli : చేతికి స్టిచ్చెస్తో ఆడి.. అద్భుత సెంచరీ బాది.. కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ గుర్తు చేసిన మాజీ ఆటగాడు