బొటనవేలంత గబ్బిలం!
హాయ్ ఫ్రెండ్స్... మీరు గబ్బిలాన్ని చూసే ఉంటారు కదా! ఎగరగలిగే ఏకైక క్షీరదం ఇదే అన్న విషయం తెలిసే ఉంటుంది కదూ! అయితే ఇప్పుడు బొటనవేలి పరిమాణంలో ఉండే గబ్బిలం గురించి తెలుసుకుందాం సరేనా!
ప్రపంచంలోకెల్లా అతిచిన్న గబ్బిలమైన దీని పేరు బంబుల్ బీ. కిట్టీస్ హాగ్‌నోస్‌డ్ బ్యాట్ అని కూడా దీన్ని పిలుస్తుంటారు. ఇవి థాయ్‌లాండ్, మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. ప్రస్తుతం ఇవి అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాయి. ఈ గబ్బిలాలు ఎక్కువగా నదులవెంట ఉండే గుహల్లో జీవిస్తుంటాయి. ఇవి సమూహాలుగా ఉంటాయి. ఒక్కో గుంపులో దాదాపు 100 వరకు గబ్బిలాలు నివసిస్తుంటాయి.
పురుగుల్ని కర్..కర్..!
ఈ బుజ్జి గబ్బిలాలు ఎక్కువగా చిన్న చిన్న పురుగుల్ని ఆహారంగా తీసుకుని తమ బొజ్జను నింపుకొంటాయి. తూనీగలు, తుమ్మెదలు, సాలీడ్లు, ఈగలు, సీతాకోకచిలుకలు, దోమల్ని ఇవి ఇష్టంగా తింటాయి. ఈ గబ్బిలాల మూతి కాస్త పందిమూతిని పోలి ఉంటుంది. మయన్మార్‌లో వీటి సంఖ్య ఎంతో తెలియదు కానీ, థాయ్‌లాండ్‌లో మాత్రం వీటి సంఖ్య చాలా చాలా తక్కువ. ఇవి కేవలం ఒక్క ప్రావిన్స్‌కు మాత్రమే పరిమితమయ్యాయి. వీటిలో ఆడవి సంవత్సరానికి ఒక్క బిడ్డకు మాత్రమే జన్మనివ్వగలవు. వీటి సంఖ్య తక్కువగా ఉండటానికి, అంతరించిపోతున్న జాబితాలో ఉండటానికి ఇది కూడా ఓ కారణమే!
వాన కురిస్తే..
బంబుల్ బీ గబ్బిలాలు రోజులో కేవలం 30 నిమిషాల వరకు మాత్రమే యాక్టివ్‌గా ఉంటాయి. ఆ సమయంలోనే తమకు కావాల్సిన ఆహారాన్ని సంపాదించుకుంటాయి. చలిగాలులను ఇవి ఏమాత్రం తట్టుకోలేవు. పెద్ద పెద్ద వాన చినుకులు కూడా ఈ గబ్బిలాల పాలిట శత్రువులే. ఇవి గాల్లో ఎగురుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద పెద్ద చినుకులతో వాన పడిందనుకోండి.. ఇక అంతే సంగతి. ఇవి అమాంతం నేలకూలుతాయి.
గ్రాముల్లోనే...
ఇవి చాలా చిన్న జీవులు కాబట్టి 1.2 గ్రాముల నుంచి 2.7 గ్రాముల వరకు మాత్రమే బరువు తూగుతాయి. 36 మిల్లీమీటర్ల నుంచి 53 మిల్లీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. సాధారణంగా గబ్బిలాలు 20 సంవత్సరాల కన్నా తక్కువే జీవిస్తాయి. కొన్ని రకాలు మాత్రం 30 సంవత్సరాల వరకు జీవిస్తాయి. గతంలో ఓ గబ్బిలం అయితే 41 సంవత్సరాల వరకు జీవించి రికార్డు సృష్టించింది! కానీ ఈ ‘బంబుల్ బీ’ల జీవితకాలం కచ్చితంగా తెలియదు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ బుజ్జి గబ్బిలం విశేషాలు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Couple Suicide: నిస్సహాయ స్థితిలో దంపతుల ఆత్మహత్య!
-
Politics News
EC: వయనాడ్ ఖర్చులు సమర్పించని ‘రాహుల్’పై ఈసీ వేటు!
-
India News
Ram Ramapati Bank: శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
Ts-top-news News
Summer: మండే వరకు ఎండలే.. ఏడు జిల్లాలకు హెచ్చరికలు
-
Crime News
Andhra News: సీఎం జగన్‌పై పోస్టులు పెట్టారని ప్రవాసాంధ్రుడి అరెస్టు