నేనూ గబ్బిలాన్నే!
హాయ్ ఫ్రెండ్స్... బాగున్నారా? మీ అందరికీ ఒక్క రోజు ఆలస్యంగా హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నారు. నేను ఎవరనా... నేనండీ గబ్బిలాన్ని. ‘మరేంటి ఇలా ఉన్నావ్?’ అని ఆశ్చర్యపోతున్నారా...! ఆ విషయం చెప్పడానికే ఇదిగో ఇలా వచ్చాను.
నేస్తాలూ... నా పేరు సుత్తి తల గబ్బిలం. పెద్ద పెదవుల గబ్బిలం అని కూడా పిలుస్తారు. సుత్తిలా ఉండే నా తల, పెద్దగా ఉండే నా పెదవులను బట్టి నాకు ఈ పేరు వచ్చింది. ‘మరి నువ్వెప్పుడూ మాకు కనిపించలేదే..?’ అని మీరు నన్ను అడగాలనుకుంటున్నారు కదూ! ఆగండి.. ఆగండి.. అంత తొందరెందుకు. అన్ని విషయాలూ చెబుతాగా! నేను మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో నివసిస్తాను. నేను పండ్లను తిని జీవిస్తాను. నాకు మామిడి పండ్లు, అరటి పండ్లు, జామపండ్లంటే ఇష్టం. వాటిని తెగ లాగించేస్తా.
ఆఫ్రికా ఖండంలోనే...
మీకో విషయం తెలుసా.. నేను ఆఫ్రికా ఖండంలోనే పెద్ద గబ్బిలాన్ని. ఇంకే గబ్బిలమూ నా అంత పెద్దగా ఉండదు. నేను నా రెక్కలను చాస్తే దాదాపు ఒక మీటరు వెడల్పుంటాను. మాలో మగవి ఆడవాటికన్నా రెట్టింపు పరిమాణంలో ఉంటాయి. మేం ఎబోలో వైరస్‌కు రిజర్వాయర్లలా పనిచేస్తాం. మాలో విపరీతంగా యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి. ఆ వైరస్ మమ్మల్ని ఏమీ చేయలేదు. కానీ మీ మనుషులకు మాత్రం చాలా ప్రమాదం.
అప్పట్లోనే....
అమెరికాకు చెందిన హారిసన్ ఎలెన్ అనే శాస్త్రవేత్త నన్ను 1861లో కొత్తజాతి గబ్బిలం అని తేల్చారు. ఇంతకీ నేను ఎంత బరువుంటానో చెప్పనే లేదు కదూ! మాలో మగవి 420 గ్రాముల వరకు బరువుంటాయి. ఆడవి మాత్రం కేవలం 234 గ్రాముల బరువు మాత్రమే తూగుతాయి. మేం కూడా మిగతా గబ్బిలాల మాదిరే పగలంతా విశ్రాంతి తీసుకుని, రాత్రిపూట సంచరిస్తుంటాం. అంటే మేం కూడా నిశాచరులమే.
ప్రకృతికి ఎంతో మేలు..
నేను ఆహారం కోసం దాదాపు 10 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణిస్తాను. నేను చెట్టు మీదే పండ్లను తినేస్తాను. అప్పుడప్పుడు వాటి తెంచుకుని మరో చోటుకు తీసుకెళ్లి అక్కడ కూడా తింటుంటాను. నేను పండ్లను నమిలి రసాన్ని మింగుతాను. పిప్పిని మాత్రం ఊసేస్తాను. దీని వల్ల ప్రకృతికి ఎంతో మేలు. ముఖ్యంగా మావల్ల జామచెట్లకు ఎంతో ఉపయోగం. ఎందుకంటే మేం ఇలా పిప్పిని ఊసేస్తాం కదా..! అది జామపండుది అనుకోండి. అందులో చాలా జామ విత్తనాలుంటాయి. వాటిలోంచి కొత్తమొక్కలు వస్తాయి. ఇలా మా వల్ల అడవుల్లో పచ్చదనం వృద్ధి చెందుతుందన్నమాట. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి.. బై.. బై...!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Hyderabad: విశ్రాంత ఐఏఎస్ అధికారికి మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా
-
India News
Amit Shah: బెంగాల్లో ఘర్షణలపై హోం మంత్రి అమిత్ షా ఆరా.. గవర్నర్‌కు ఫోన్
-
Sports News
GT vs CSK: రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ మిస్.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Politics News
Karnataka polls: ఎన్నికల వేళ జేడీఎస్‌కు షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా!
-
Movies News
SIR: ‘సార్’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ