భారీ ఎరేజర్..!
హాయ్ ఫ్రెండ్స్.. మనకో స్కూల్ బ్యాగూ, అందులో కంపాస్ బాక్సూ, దానిలో పెన్సిల్, ఎరేజరూ లాంటి సామగ్రి కచ్చితంగా ఉంటాయి కదా! సాధారణంగా మనం వాడే ఎరేజర్లు అంగుళం పరిమాణంలో ఉంటాయి. ప్రస్తుతం కొత్తగా మార్కెట్లోకి వచ్చేవి అయినా చేతిలో ఇమిడిపోయేంతవే. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎరేజర్ మాత్రం చేతిలో కాదు కదా.. కనీసం బ్యాగులో కూడా పట్టనంత పెద్దది. ఆ విశేషాలేంటో చదివేయండి మరి..
ఓ విదేశీ సంస్థ ఇటీవల రెండు కేజీలకంటే బరువైన ఎరేజర్‌ను తయారు చేసింది. దానికి ‘రాడార్ ఎస్-10000’ అని పేరు కూడా పెట్టింది. ‘కిలోల కొద్దీ బరువుండే స్కూల్ బ్యాగ్‌నే మోయలేకపోతుంటే.. ఇంతపెద్ద ఎరేజర్‌ను ఎలా తీసుకెళ్తాం?’ - అనే అనుమానం మీకు అక్కర్లేదు. ఎందుకంటే.. దీన్ని తయారు చేసిన ఉద్దేశం వేరే కాబట్టి.
రెండు కేజీలకు పైగా..
జపాన్‌కు చెందిన ఓ కంపెనీ ఎరేజర్లు తయారు చేసే వ్యాపారంలో ఉంది. ఆ సంస్థ ఉత్పత్తుల్లో 1968లో ప్రారంభించిన ‘రాడార్’ అనే బ్రాండ్‌కు మంచి పేరుంది. ఈ బ్రాండ్ మీద తక్కువ నుంచి ఎక్కువ ధర వరకూ వీళ్లు ఎరేజర్లను విక్రయిస్తున్నారు. గతంలో ఈ సంస్థ.. ఎస్-1000, ఎస్-జంబో పేరిట రెండు పెద్ద ఎరేజర్లను తయారు చేసింది. వాటికంటే పెద్దది రూపొందించి, రికార్డు సాధించాలనే లక్ష్యంతో తాజాగా 2285 గ్రాముల బరువైనది సిద్ధం చేశారు. వీళ్లు తయారు చేసే వాటిలో అత్యంత చిన్నదాని కంటే ఈ ఎస్-10000 రెండొందల రెట్లు పెద్దదట. 276 మిల్లీమీటర్ల పొడవు, 141 మిల్లీమీటర్ల వెడల్పు, 43 మిల్లీమీటర్ల ఎత్తు ఉన్న ఈ ఎరేజరే ప్రపంచంలోకెల్లా పెద్దదిగా చెబుతున్నారు.
అంత ధరా..?
ఈ ఎరేజర్ ధర కూడా దాని పరిమాణం మాదిరే ఉంటుంది. ఎంత అంటే.. మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ.84,000. ఇటీవల ఈ భారీ ఎరేజర్ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. చూసిన వారంతా ‘బాబోయ్’ అంటూ అవాక్కవుతున్నారట. మన దగ్గర కాదు కానీ కొన్ని ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ఇది అందుబాటులో ఉందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు మరి!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Agniveers: ఐఎన్ఎస్ చిలికాలో తొలి బ్యాచ్ అగ్నివీర్ల పాసింగ్ అవుట్ పరేడ్.. త్వరలోనే విధుల్లోకి
-
Sports News
Lionel Messi: మెస్సికి అరుదైన గౌరవం.. ఫుట్‌బాల్ దిగ్గజాల సరసన విగ్రహం
-
Movies News
Priyanka Chopra: బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. అందుకే హాలీవుడ్‌కి వెళ్లానంటూ
-
Politics News
DK Shivkumar: ఎన్నికల ప్రచారంలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకేఎస్.. వీడియో వైరల్
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
-
Latestnews News
Quadruplets: ఒకే కాన్పులో నలుగురు పిల్లల జననం