గాలిపటమా... పదపద!
హాయ్ ఫ్రెండ్స్... మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మనలాంటి పిల్లలకు గాలిపటాలే గుర్తుకువస్తాయి కదా! మరి వాటి విశేషాలు, అవి ఎగరేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ రోజు తెలుసుకుందాం సరేనా! మరింకెందుకాలస్యం... చకచకా.. ఈ కథనం చదివేయండి!
గాలిపటం.. పతంగి.. కైట్.. ఇలా పేరు ఏదైనా.. మనలాంటి పిల్లలు కేరింతలు కొట్టేలా చేస్తుంది ఇది. మనం సంక్రాంతి పండుగ నేపథ్యంలో గాలిపటాలను ఎగరేస్తాం కానీ... నిజానికి ఇవి పుట్టింది చైనాలో. అవును.. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఇవి చైనాలో పురుడుపోసుకున్నాయి. అప్పట్లో వీటిని సమాచారాన్ని చేరవేయడానికి, యుద్ధంలో శత్రువుల మీద నిఘా పెట్టడానికి వాడేవారట. అంటే ఓ రకంగా డ్రోన్లలా అన్నమాట. తర్వాత కాలంలో వాతావరణ పరిశోధనలోనూ పతంగులు ప్రముఖ పాత్రే పోషించాయి. రేడియో సిగ్నళ్లు పంపడానికి, భూమి ఫొటోలు తీయడానికి కూడా కొందరు ఈ గాలిపటాల సాయం తీసుకున్నారట.
వస్త్రంతో తయారై...
మొదట చైనాలో ఈ గాలిపటాలు వస్త్రంతో తయారయ్యాయట. ఇప్పటికీ వస్త్రంతో తయారయ్యే గాలిపటాలూ ఉన్నాయి. కాకపోతే ఇవి చాలా పెద్దవి. అప్పుడప్పుడు మన దగ్గర జరిగే కైట్ ఫెస్టివల్స్‌లో ఇలాంటివి ప్రదర్శిస్తుంటారు. మనం మామూలుగా దారంతో గాలిపటాలను ఎగరవేస్తాం కదా! కానీ ఈ పెద్ద గాలిపటాలను ఎగరేయడానికి ఏకంగా తాళ్లనే వాడతారు. అలాగే వీటిని ఎగరేయాలంటే ఓ పది, పదిహేను మంది ఉండాల్సిందే. లేకపోతే అంతేసంగతులు. అది అమాంతం గాల్లోకి ఎగరేసుకుపోతుంది!
చైనా నుంచి ప్రపంచానికి...
మొట్టమొదట చైనాలో తయారైన గాలిపటాలు తర్వాత కొరియా, జపాన్, మయన్మార్, భారతదేశం, ఇండోనేషియా, ఆఫ్రికా దేశాలు.. ఇలా క్రమక్రమంగా దాదాపు ప్రపంచమంతా పాకాయి. గాలిపటాలను ఎగరేయడంలో ఆసియా దేశాలకన్నా యూరప్ ఖండం వెనకబడిందనే చెప్పుకోవాలి. 17వ శతాబ్దం నుంచి మాత్రమే హాలెండ్, ఇంగ్లాండ్‌లో వీటిని ఎగరేస్తున్నారు. 1749లో స్కాట్లాండ్‌కు చెందిన అలెగ్జాండర్ విల్సన్ అనే వ్యక్తి ‘కైట్ ట్రైన్’ను తయారు చేసి, ఎగురవేశాడు. ‘కైట్ ట్రైన్’అంటే ఒక దారానికి చాలా గాలిపటాలు వరుసలో ఉంటాయి. ఈ ‘కైట్ ట్రైన్’ సాయంతో ఆయన వాతావరణంలో వేరు వేరు ఎత్తుల్లో, వేరు వేరుగా ఉన్న ఉష్ణోగ్రతల్ని లెక్కించారు. బెంజిమెన్ ఫ్రాంక్లిన్ కూడా గాలి పటం సాయంతో మేఘాల మీద కొన్ని ప్రయోగాలు చేశారు. ఇలా గాలిపటాలకు చాలానే చరిత్ర ఉంది. మరి మనం ప్రస్తుతం వాటిని ఎగరేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందామా!
మాంజా వద్దే వద్దు!
నేస్తాలూ... గాలిపటం ఎగరేయడం వల్ల మనకు ఆనందం వస్తుంది. కానీ, మాంజాల వల్ల చాలా నష్టాలున్నాయి. వాటి కారణంగా పక్షులు గాయాలపాలయ్యే, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అంతవరకు ఎందుకు.. కొన్ని సంఘటనల్లో మాంజాల వల్ల ద్విచక్రవాహనదారులూ ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలూ ఉన్నాయి. అందుకే మాంజాలు వాడకుండా మామూలు దారంతోనే గాలిపటాలను ఎగరేయాలి.
ఖాళీ స్థలాల్లోనే...
భవంతులు, రోడ్ల మీద సాధ్యమైనంత వరకు గాలిపటాలతో ఆడుకోకూడదు. దీని వల్ల ప్రమాదాలు జరగొచ్చు. మైదానాల్లో చెట్లు, విద్యుత్తు తీగలు లేని ప్రదేశాల్లో మాత్రమే గాలిపటాలను ఎగరేయాలి. పతంగులు ఎగరేసేటప్పుడు నల్ల కళ్లద్దాలు వాడటం మంచిది. ఇవి సూర్యుడి అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లను కాపాడతాయి. చిక్కుకున్న గాలిపటాల కోసం చెట్లు, విద్యుత్తు స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కకూడదు. అలాగే తెగిన గాలిపటాల కోసం రోడ్ల మీద అడ్డదిడ్డంగా పరిగెత్తకూడదు. దీని వల్ల మనకూ, వాహనదారులకూ ప్రమాదమే. అలాగే ప్లాస్టిక్ కవర్లతో తయారైన పతంగుల బదులు, కాగితంతో చేసిన గాలిపటాలనే ఎగరేయాలి. దీనివల్ల ప్రకృతికీ మేలు చేసినవాళ్లమవుతాం. నేస్తాలూ...! మొత్తానికి ఇవీ గాలిపటాల సంగతులు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సరే మరి... మీ అందరికీ మరోసారి... సంక్రాంతి శుభాకాంక్షలు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Movies News
Shaakuntalam: అలా నేను వేసిన తొలి అడుగు ‘శాకుంతలం’: దిల్ రాజు
-
India News
DCGI: 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లు రద్దు చేసిన కేంద్రం
-
World News
North korea: కిమ్మా.. మజాకానా? లాక్డౌన్లోకి ఉత్తర కొరియా నగరం!
-
Politics News
Chandrababu: కేంద్రానికి, మీకు ప్రత్యేక ధన్యవాదాలు.. ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ
-
World News
Donald Trump: ‘24 గంటల్లోపే ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించుతా..!’