పిసరంత మర పీత!
అదో పీత... మామూలు పీత కాదు. మర పీత! ఇది ఎంచక్కా నడుస్తుంది. చక్కగా తిరుగుతుంది. బేషుగ్గా దూకుతుంది. స్ప్రింగులా వంగుతుంది.
అదో పీత... మామూలు పీత కాదు. మర పీత! ఇది ఎంచక్కా నడుస్తుంది. చక్కగా తిరుగుతుంది. బేషుగ్గా దూకుతుంది. స్ప్రింగులా వంగుతుంది. చకచకా మెలితిరుగుతుంది. భలే తమాషాగా ఉంది కదూ! మరి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉందా...! అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి.
అమెరికాకు చెందిన నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ పరిశోధకులు ఈ మర పీతను తయారు చేశారు. ఇది కేవలం అర మిల్లీమీటరే ఉంటుంది. అంటే ఈగకన్నా కూడా మరీ చిన్నగా ఉంటుంది. సూది బెజ్జంలో కూడా దూరేంత సూక్ష్మంగా ఉంటుందన్నమాట. ఇంతకీ ఈ పిసరంత మర పీత మీద ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారో తెలుసా! పరిశ్రమల్లోని చిన్న చిన్న నిర్మాణాలు, యంత్రాలను మరమ్మతు చేయడానికి, ధమనుల్లోని అడ్డంకులను తొలగించడానికి, అంతర్గత రక్తస్రావాలను ఆపడానికి, క్యాన్సర్ కణితులను తొలగించడానికి ఈ మైక్రో రోబోలను తయారు చేస్తున్నారు.
రిమోట్ సాయంతో...
ఈ రోబో పీత రిమోట్ సాయంతో కదులుతుంది. ఉండటం కేవలం అర మిల్లీమీటరే అయినా... వేగం మాత్రం దీని పరిమాణంతో పోల్చుకుంటే ఎక్కువ అనే చెప్పాలి. ఈ మర పీతకు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే... దీన్ని ప్రత్యేకంగా సాగే గుణమున్న పదార్థంతో తయారు చేశారు. దీని నుంచే అది తనకు కావాల్సిన శక్తిని సమకూర్చుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. నేస్తాలూ మొత్తానికి ఇవీ పిసరంత మర పీత సంగతులు. భలే గమ్మత్తుగా ఉన్నాయి కదూ!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Train Accident: కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం.. పలు రైళ్ల రద్దు, కొన్ని దారి మళ్లింపు
-
World News
Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!
-
India News
Train Accident: ‘కోరమాండల్’ ఎక్స్ప్రెస్ ప్రమాదం.. ఉలిక్కి పడిన 4 రాష్ట్రాలు
-
World News
Ukraine: జెలెన్స్కీ ఇంటి ఎదుట ‘నాటు-నాటు’ పాటకు దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
-
Movies News
Samantha: ప్రియాంక చోప్రా తల్లిగా సమంత.. సమాధానం వచ్చినా సందేహమే!
-
India News
1945 నుంచి.. ఆ చర్చిలో 927 మందిపై లైంగిక వేధింపులు!