బెలూన్లతో భలే ఆట!
హాయ్ నేస్తాలూ.. మనకు దాదాపు వేసవి సెలవులు వచ్చేశాయి కదా.. ఎండలకు భయపడి, ఆడుకునేందుకు అమ్మానాన్న మిమ్మల్ని బయటకు వెళ్లనివ్వడం లేదా? ఇంట్లో ఆ సెల్‌ఫోన్‌తో, టీవీతో బోర్ కొట్టేసిందా? అయితే, ఇప్పుడు మనం ఇంటి పరిసరాల్లోనే ఉంటూ..
హాయ్ నేస్తాలూ.. మనకు దాదాపు వేసవి సెలవులు వచ్చేశాయి కదా.. ఎండలకు భయపడి, ఆడుకునేందుకు అమ్మానాన్న మిమ్మల్ని బయటకు వెళ్లనివ్వడం లేదా? ఇంట్లో ఆ సెల్‌ఫోన్‌తో, టీవీతో బోర్ కొట్టేసిందా? అయితే, ఇప్పుడు మనం ఇంటి పరిసరాల్లోనే ఉంటూ.. సరదాగా ఉండే ఓ కొత్త ఆటను నేర్చుకుందాం. అంతేకాదు.. ఓ స్కూల్ విద్యార్థులంతా కలిసి ఆ ఆటలో రికార్డూ సాధించారు. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా!
అమెరికాలోని నెబ్రస్కా ప్రాంతంలో ఉండే ఓమహా సెంట్రల్ హైస్కూల్ విద్యార్థులు ‘వాటర్ బెలూన్ టాస్’ ఆటతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. మనకు అంతగా పరిచయం లేని ఈ ఆటను అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా ఆడుతుంటారు. ఇటీవల ఈ స్కూల్ ఆవరణలో దాదాపు 1500 మంది విద్యార్థులు ఈ ఆట ఆడి ప్రపంచ రికార్డు సాధించే ప్రయత్నం చేశారు.
బెలూన్‌లో నీళ్లు నింపి..
ఇంతకీ అసలు ఈ ‘వాటర్ బెలూన్ టాస్’ ఆట ఏంటంటే.. బెలూన్‌లో దాదాపు ఒక గ్లాసుడు నీళ్లు నింపి ముడి వేయాలి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కొంతదూరంలో ఎదురెదురుగా నిల్చోవాలి. బెలూన్‌ను పట్టుకున్న వ్యక్తి బంతి మాదిరి దాన్ని అవతలి వారికి విసరాలి. అతను దాన్ని పట్టుకుంటే, ఇద్దరూ ఒక అడుగు వెనక్కి జరిగి.. మళ్లీ ఆటను ఆడాలి. ఒకవేళ ఆ బెలూన్ కిందపడితే, అక్కడే నిల్చొని ఆటను కొనసాగించాల్సి ఉంటుంది. ఆ బెలూన్ కిందపడి పగిలిపోతే మాత్రం వారిద్దరూ అవుట్ అయినట్లు లెక్క. ఒక టైమ్ పెట్టుకొని, పాయింట్లు నమోదు చేసుకుంటూ వరండాలోనే ఎంచక్కా ఈ ఆటను ఆడుకోవచ్చన్నమాట.
అన్నీ చూశాకే పోటీలోకి..
కొన్ని రోజుల కిందట ఓమహా స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులంతా ప్రిన్సిపల్‌ని కలిసి, పిల్లల మధ్య ఐక్యత పెరిగేలా ఏదైనా కార్యక్రమం నిర్వహించాలని కోరారట. ఈ చర్చలో ‘వాటర్ బెలూన్ టాస్’ ఆట ఆడించి, రికార్డు సాధించాలనే నిర్ణయానికొచ్చారు. స్కూల్ ఆవరణలోని ఫుట్‌బాల్ గ్రౌండే అందుకు వేదికగా మారింది. దాదాపు పదిహేను వందల మంది విద్యార్థులు ఈ ఆటలో పాల్గొన్నారు. అలాగని, అందరికీ ఆడే అవకాశం దక్కలేదు. హాజరు శాతం ఎక్కువగా ఉండి, క్రమశిక్షణతో మెలిగే వారికే ఈ పోటీలో పాల్గొనే అవకాశం వచ్చిందట. గిన్నిస్ బుక్ ప్రతినిధులు కూడా పోటీలను ప్రత్యక్షంగా పరిశీలించి, సంబంధిత వివరాలను నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకూ ఈ రికార్డు 2014లో అమెరికాలోనే ఓ స్కూల్‌కు చెందిన 902 మంది విద్యార్థుల పేరిట ఉండేది. తాజాగా ఆ రికార్డును ఓమహా పాఠశాల పిల్లలు అధిగమించారన్నమాట.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
బిహార్ సీఎం కాన్వాయ్ కోసం.. పసిబిడ్డతో గంటసేపు ఆగిన అంబులెన్స్
-
World Culture Festival: రెండో రోజు ఉత్సాహంగా యోగా, మెడిటేషన్
-
America: అమెరికాకు తొలగిన షట్‌డౌన్ ముప్పు
-
Oscar winner Pinky: ‘ఆస్కార్ విజేత’ పింకీ.. ఇపుడు నవ్వటం లేదు!
-
Donald Trump: బైడెన్.. మెట్ల దారిని గుర్తించలేరు.. డొనాల్డ్ ట్రంప్ ఎద్దేవా
-
Jagananna Arogya Suraksha: ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహిస్తే బడికి సెలవే..!