మ్యావ్... మ్యావ్... పిల్లిని...భలే.. భలే... రికార్డున్న పిల్లిని!
హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా! నేనెవరో తెలుసా... నేనో పిల్లిని. ‘ఓస్ పిల్లివేగా! మా ఊళ్లోనూ బోలెడు పిల్లులున్నాయి’ అని మీరు అనేస్తారేమో! కానీ నేను మామూలు మ్యావ్.. మ్యావ్‌ని కాదు.
హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా! నేనెవరో తెలుసా... నేనో పిల్లిని. ‘ఓస్ పిల్లివేగా! మా ఊళ్లోనూ బోలెడు పిల్లులున్నాయి’ అని మీరు అనేస్తారేమో! కానీ నేను మామూలు మ్యావ్.. మ్యావ్‌ని కాదు. ఓ ప్రత్యేకత ఉన్న పిల్లిని. అదేంటో తెలుసా! అయినా నేను చెప్పకుండా మీకు ఎలా తెలుస్తుంది! ఆ విశేషాలు చెబుదామనే.. ఇదిగో ఇలా వచ్చాను. మరి నా గురించి తెలుసుకోవడానికి మీరు సిద్ధమేనా!
నా పేరు ఫ్లోసీ. నేనుండేది లండన్‌లో. నా వయసు ప్రస్తుతం 27 సంవత్సరాలు. బతికున్న పిల్లుల్లో ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ వయసున్న దాన్ని నేనే. క్రేమ్ పఫ్ అనే పిల్లి అయితే గతంలో ఏకంగా 38 సంవత్సరాల మూడు రోజులు బతికింది. ఇంకా కొన్ని పిల్లులు 30, 31 సంవత్సరాలు కూడా బతికాయి. కానీ ప్రస్తుతం అవేవీ జీవించిలేవు. అందుకే ఈ ఘనతను ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ వాళ్లు నాకు కట్టబెట్టారు.
కొంచెం వినిపించదు... కాస్త కనిపించదు!
మామూలుగా అయితే పిల్లులు 10 నుంచి 12 సంవత్సరాలు మాత్రమే బతుకుతాయి. నేను నా ఆయుర్దాయానికి మించి జీవిస్తున్నా కాబట్టి, కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా! ముఖ్యంగా నాకు కొంచెం చెవులు వినిపించవు. కళ్లు కూడా కాస్త కనిపించవు. అయినా నాకొచ్చిన ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే నా యజమానురాలు నన్ను కంటికి రెప్పలా, అల్లారుముద్దుగా చూసుకుంటోంది మరి.
మా వయసు సేమ్ టు సేమ్....
మా యజమానురాలి పేరు వికీ గ్రీన్. ఆమె వయసు కూడా 27 సంవత్సరాలే. అంటే సేమ్ టు సేమ్ నా వయసే. నేను 1995లో పుట్టాను. అప్పుడు వేరే వాళ్లు నన్ను పది సంవత్సరాల పాటు పెంచుకున్నారు. తర్వాత నేను మరి కొన్ని చోట్ల కొన్నాళ్లు పెరిగాను. ఇక ఆఖరున వికీ గ్రీన్ నాకు యజమానురాలైంది. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. ఈమె నాకు కాస్త కూడా లోటూ రాకుండా చంటి పాపాయిలా చూసుకుంటోంది.
రికార్డు బద్దలు కొట్టాలని...
మీకు ఇంతకు ముందే చెప్పానుగా క్రేమ్ పఫ్ అనే పిల్లి టెక్సాస్‌లో 38 సంవత్సరాలు బతికిందని! దాని రికార్డును నాతో బద్దలు కొట్టించడానికి నా యజమానురాలు కంకణం కట్టుకుంది. నేను కచ్చితంగా 38 సంవత్సరాలకు మించి బతుకుతానని ఆమె గట్టి నమ్మకంతో ఉంది. నాకూ అంతకాలం జీవించాలని ఉందనుకోండి. ఎందుకంటే నన్ను ఈమె పసిపిల్లలా చూసుకుంటోంది కదా! సరే నేస్తాలూ... ఇక ఉంటామరి. మీరు కూడా నేను ఇంకా ఎక్కువకాలం బతకాలని మనసారా కోరుకోండి సరేనా. మ్యావ్.. మ్యావ్...! అదే నేస్తాలూ.. నా భాషలో మీకు బై.. బై.. చెబుతున్నా.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
KL Rahul: కెప్టెన్సీ అంటే ఇష్టం.. ఇది నాకేం కొత్త కాదు: కేఎల్ రాహుల్
-
IRCTC tour package: ఒక్క రోజులోనే ఆంధ్రా ఊటీ అందాలు చూసొస్తారా?.. IRCTC టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే..!
-
Koppula Harishwar Reddy: ప్రభుత్వ అధికార లాంఛనాలతో హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలు
-
Chandrababu Arrest : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు విచారణ ప్రారంభం
-
Kakinada: పామాయిల్ తోటలో విద్యుత్ తీగలు తగిలి.. ముగ్గురి మృతి
-
Justin Trudeau: ‘మేం ముందే ఈ విషయాన్ని భారత్‌కు చెప్పాం’: ఆగని ట్రూడో వ్యాఖ్యలు