పుస్తకాలు ఇస్తూ.. సెలవుల్లో చదివిస్తూ..!
హలో ఫ్రెండ్స్.. వేసవి సెలవులు అయిపోవచ్చాయి.. వచ్చే వారం నుంచి బడులు తెరుస్తారు. మరి.. ‘ఈ సెలవుల్లో మీరేం చేశారు?’ అని ఎవరైనా అడిగితే చాలామంది సెల్‌ఫోన్‌తోనే సరిపోయిందంటారు.
హలో ఫ్రెండ్స్.. వేసవి సెలవులు అయిపోవచ్చాయి.. వచ్చే వారం నుంచి బడులు తెరుస్తారు. మరి.. ‘ఈ సెలవుల్లో మీరేం చేశారు?’ అని ఎవరైనా అడిగితే చాలామంది సెల్‌ఫోన్‌తోనే సరిపోయిందంటారు. ఒకరిద్దరు సంగీతమో, డ్యాన్సో నేర్చుకున్నామంటారు. అందుకే, ఓ మాస్టారు అయితే సెలవుల్లో పిల్లలు సెల్‌ఫోన్‌కు అలవాటు కాకుండా ఉంచే ప్రయత్నం చేశారు. ఆ వివరాలే ఇవీ..
మహారాష్ట్రలోని గిత్వాడీ ప్రభుత్వ పాఠశాలలో తుకారాం అడ్సల్ అనే ఉపాధ్యాయుడు అయిదేళ్లుగా పనిచేస్తున్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఖాళీగా ఉంటూ, సెల్‌ఫోన్‌కు అతుక్కుపోకుండా చూడాలని అనుకున్నారాయన. దాంతో వారికి పుస్తకాలు చదివించడం అలవాటు చేయించారు.
ఎండలనూ లెక్క చేయక..
గిత్వాడీ పాఠశాలలో ఒకటి నుంచి నాలుగో తరగతి చదివే విద్యార్థులున్నారు. వారంతా కొండ ప్రాంతాల పైన నివాసం ఉంటుంటారు. ఈ వేసవి సెలవులు మొత్తం ఆయన ప్రతి రోజూ రెండు బ్యాగుల నిండా పుస్తకాలతో విద్యార్థుల ఇళ్లకు వెళ్లేవారట. వారికి కావాల్సిన కథలు పుస్తకాలు, నవలలను అందించేవారు. చుర్రుమనిపించే ఎండలను సైతం ఆ మాస్టారు లెక్క చేసేవారు కాదట.
బడిలోనే గ్రంథాలయం
తుకారాం మాస్టారు ఈ బడిలో చేరిన మొదటి రోజే ఎలాగైనా విద్యార్థుల్లో పుస్తక పఠనం పెంపొందించాలని అనుకున్నారు. అలా కొద్దిరోజులకే ప్రభుత్వం అందించే వాటితోపాటు తన సొంత డబ్బులతో కొన్ని పుస్తకాలు కొనుగోలు చేశారు. గ్రామస్థులూ మరికొన్ని సమకూర్చడంతో వాటన్నింటితో పాఠశాలలోనే గ్రంథాలయం ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ప్రతి శనివారం పిల్లలంతా బ్యాగులు లేకుండానే స్కూల్‌కి వస్తారట. ఆరోజు మొత్తం గ్రంథాలయంలో వారికిష్టమైన పుస్తకాలే చదువుతారు. ఒక్కో విద్యార్థి ఏడాదికి 30 నుంచి 40 పుస్తకాలు చదివేలా చూడాలనేది ఆ మాస్టారి ప్రయత్నం. నిత్యం వారితో దినపత్రికలు కూడా చదివిస్తూ.. పిల్లలకు సంబంధించిన కథనాలపైన చర్చ కూడా నిర్వహిస్తుంటారు.
ఆ గ్రామంలో ఎవరివైనా పుట్టినరోజుల్లాంటి సందర్భాల్లో పుస్తకాలే బహుమతిగా ఇచ్చేలా ప్రజల్లో అవగాహన కల్పించారు.
పచ్చదనం పెంపు..
పాఠశాల ఆవరణలోనే మొక్కలు పెంచడంతోపాటు విద్యార్థులకు పర్యావరణ ఆవశ్యకతను వివరిస్తూ.. వారి ఇళ్లకు కూడా పంపిణీ చేస్తున్నారు. పిల్లల్లో భాషా నైపుణ్యాలు పెంపొందించేలా, ఇతర భాషలకు సంబంధించిన పుస్తకాలనూ త్వరలో వారికి అందించనున్నారట. లోకజ్ఞానం తెలియని ఆ గ్రామంలోని పిల్లలను ఈ మాస్టారు తీర్చిదిద్దుతుండటంతో తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. నేస్తాలూ.. నిజంగా తుకారాం సారు గ్రేట్ కదూ! మనమూ పుస్తక పఠనం అలవాటు చేసుకుందామా మరి!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి
-
వరద నీటిలో కొట్టుకుపోయిన 190 పశువులు
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?