సీసాల చెట్టు.... మెరుపుల కనికట్టు!

మొక్కల్ని పెంచితే చెట్లవుతాయి కదా. కానీ ఎల్మర్‌ లాంగ్‌ అనే కళాకారుడు మాత్రం మొక్కల్ని పెంచకుండానే చెట్లను తయారుచేశాడు. ఈయన చెట్ల ప్రత్యేకత ఏంటో తెలుసా? అవి సీసాలతో కనువిందు చేయడమే!

Published : 04 Apr 2016 00:29 IST

సీసాల చెట్టు.... మెరుపుల కనికట్టు!

పాత సీసాలను ఏం చేస్తాం... మనమైతే అమ్మేస్తాం లేదా పారేస్తాం... కానీ ఎల్మర్‌ లాంగ్‌కు ఇచ్చి చూడండి... అందమైన చెట్లుగా మార్చేస్తాడు...ఎలాగో మీరే చదవండి!

మొక్కల్ని పెంచితే చెట్లవుతాయి కదా. కానీ ఎల్మర్‌ లాంగ్‌ అనే కళాకారుడు మాత్రం మొక్కల్ని పెంచకుండానే చెట్లను తయారుచేశాడు. ఈయన చెట్ల ప్రత్యేకత ఏంటో తెలుసా? అవి సీసాలతో కనువిందు చేయడమే! 

* బాటిల్‌ ట్రీ రంచ్‌ పేరిట దారి పక్కనే వందలాది సీసాల చెట్లను రూపొందించాడు. చూడాలంటే అమెరికా కాలిఫోర్నియాలోని మొజావే కౌంటీకి వెళ్లాల్సిందే.

* ఇనుప కడ్డీలకే రంగు రంగుల సీసాల్ని ఇరువైపులా కొమ్మల్లా అమర్చి చెట్ల ఆకారంలో తీర్చిదిద్దాడన్నమాట. ఒక్కోదానికి నలభై వరకు సీసాలు అతికిస్తూ పనికిరాని ఫ్యాను చక్రాల్లాంటి వాటిని పైభాగంలో ఉంచి అలంకరిస్తాడు. 

* అసలీ ఆలోచన ఎలా, ఎందుకు వచ్చింది అంటే? ఎల్మర్‌ లాంగ్‌ చిన్నప్పుడు నాన్నతో పాటు రకరకాల వస్తువుల్ని సేకరించేవాడు. వాళ్ల నాన్న చనిపోయాక, వీరిద్దరూ కలిసి అప్పటి వరకు సేకరించిన వందలాది సీసాల్ని ఏం చేయాలని ఆలోచించి ఎల్మర్‌ సరదాగా కడ్డీకి సీసాల్ని అతికించాడు. నీలం, ఆకుపచ్చ, గోధుమ రంగులో ఉన్న ఆ సీసాలన్నీ సూర్యకాంతికి మెరుస్తూ ఉండటం చూశాడు. ఇదేదో బాగుందే అనుకుని అప్పటి నుంచి గాజు సీసాలన్నింటితో చెట్లు చేసి ప్రదర్శనకు పెట్టాడు.

* పైగా ఇవన్నీ తాటి చెట్లంత ఎత్తుంటాయి. వీటిని చూడ్డానికి రోజూ పర్యటకులు వస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని