చుట్టూ షార్కులు... మధ్యలో భోజనం!

పెద్ద పెద్ద షార్కుల్ని దగ్గర్నించి చూడొచ్చు...సరదాగా ఓ రోజంతా వాటితోనే గడపొచ్చు...నీటి అడుగు భాగంలో హాయిగా సేదతీరొచ్చు...ఇంతకీ ఎలాగో ఏంటో?

Published : 15 Apr 2016 00:47 IST

చుట్టూ షార్కులు... మధ్యలో భోజనం!
పెద్ద పెద్ద షార్కుల్ని దగ్గర్నించి చూడొచ్చు...సరదాగా ఓ రోజంతా వాటితోనే గడపొచ్చు...నీటి అడుగు భాగంలో హాయిగా సేదతీరొచ్చు...ఇంతకీ ఎలాగో ఏంటో?

దో పోటీ. దేశదేశాల నుంచి ఎవరైనా పాల్గొనవచ్చు. గుండెధైర్యం ఉన్న వాళ్లే ముందుకు వస్తారు. ఎందుకో తెలుసా? గెలుపొందిన వారికి ఇచ్చే బహుమతి అలాంటిలాంటిది కాదు. నీటి అడుగున అక్వేరియంలో సొరచేపల మధ్య ఆతిథ్యం ఇస్తారు. భలేగా ఉంది కదూ!

* ఫ్రాన్స్‌లోని ‘అక్వేరియం డి ప్యారిస్‌’ వాళ్లు నిర్వహించిన ఈ పోటీ సముద్ర వాతావరణంలో గడపాలనుకునే వారిని, సాహసికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ మధ్యే పోటీ జరిగింది. గెలుపొందిన ముగ్గురు విజేతలను మూడు రోజుల పాటు గాజు గదిలో నీళ్లలో తిప్పారు. 35 షార్కులు వాళ్ల చుట్టుముట్టాయి.

* లక్షలాది లీటర్ల నీళ్లతో ఉన్న అక్వేరియంలో ఈ గాజుగదిలో బస ఉంటుంది. పారదర్శకంగా ఉండటంతో చుట్టూ ఉన్న షార్కులన్నీ కనిపిస్తాయి. మనుషులకన్నా పొడవైన ఆ సొరచేపలు నీటిలో గది చుట్టూ చక్కర్లు కొడుతుంటే భలేగా ఉంటుంది. సముద్రంలో ఉన్న అనుభూతి కల్గుతుంది. భోజనం కూడా వాటి మధ్యే చేయొచ్చు.

* బాబోయ్‌ హఠాత్తుగా ఆ గాజు గది పగిలిపోతే? అని భయపడక్కర్లేదు. ఎందుకంటే ముందుగానే పరీక్ష చేసి సరైన జాగ్రత్తలు తీసుకునే దీన్ని ఏర్పాటుచేశారట.

* ఈ పోటీకి షార్కులతో ఎందుకు గడపాలనుకుంటున్నారో వివరిస్తూ వ్యాసం రాస్తే చాలు. అందులో ముగ్గుర్ని ఎంపిక చేసి అక్వేరియం అడుగున షార్కుల మధ్య గడిపే అవకాశం ఇస్తారన్నమాట.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని