ఒకటీ... రెండూ... మూడూ... దూకేసి చూడు!!

వందలాది మంది వంతెనపైకి ఎక్కారు. వరుసగా నిల్చున్నారు. వన్‌టూత్రీ అని లెక్కపెట్టారు. ఒక్కసారిగా కిందికి దూకారు. ఏమీ భయపడాల్సిన పన్లేదులెండి. వీళ్లంతా రోప్‌జంపింగ్‌ చేశారంతే. ఇటీవలే బ్రెజిల్‌లోని హొర్టోలాండియాలో 100 అడుగుల ఎత్తయిన వంతెనపై నుంచి 149 మంది కిందకి దూకారు.

Updated : 08 Dec 2022 22:03 IST

* వందలాది మంది వంతెనపైకి ఎక్కారు. వరుసగా నిల్చున్నారు. వన్‌టూత్రీ అని లెక్కపెట్టారు. ఒక్కసారిగా కిందికి దూకారు.
* ఏమీ భయపడాల్సిన పన్లేదులెండి. వీళ్లంతా రోప్‌జంపింగ్‌ చేశారంతే.
* ఇటీవలే బ్రెజిల్‌లోని హొర్టోలాండియాలో 100 అడుగుల ఎత్తయిన వంతెనపై నుంచి 149 మంది కిందకి దూకారు. వాళ్లంతా గాల్లో అలా తేలిపోతుంటే చూడ్డానికి మనుషుల వూయల్లా ఆ దృశ్యం భలే తమాషాగా ఉంది.
* ‘ఒకేసారి ఎక్కువ మంది చేసిన రోప్‌ జంపింగ్‌’గా ఈ విన్యాసం గిన్నిస్‌ రికార్డు. ఈ సాహసం చేయడానికి దాదాపు రెండు నెలలు సాధన చేశారు.
* ఏంటీ రోప్‌ జంపింగ్‌ ప్రత్యేకత? కొండల మీద నుంచి, వంతెనలపై నుంచి కిందకు దూకే ‘బంగీ జంప్‌’ సాహస క్రీడ గురించి తెలిసిందే. అయితే బంగీ జంప్‌లో కిందకు దూకిన వ్యక్తి మళ్లీ తాడుకున్న సస్పెన్షన్‌ వల్ల కాస్త పైకొస్తాడు. కానీ రోప్‌ జంపింగ్‌ అలా కాదు, నైలాన్‌ తాడును నడుముకు బిగిస్తారు. కిందకు దూకాక ఆ తాడుసాయంతో గాల్లో వూయల వూగినట్టు వూగుతారు. ఇది మరింత సాహసోపేతమైన క్రీడ. ఈ మధ్యే బాగా వెలుగులోకి వస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు