ఎంత పొడవైన అలలో!

సముద్రాలన్నాక అలలు రావడం సహజం. మరి ప్రపంచంలోనే పొడవైన అలలు ఏర్పడే చోటేదో తెలుసా? చూడాలనుంటే పెరూలోని ‘చికామా’ పట్టణానికి వెళ్లాలి. ఈ బీచ్‌ని దూరం నుంచి చూస్తే సముద్రంలో మెట్లలా కనిపిస్తాయి. ఎందుకంటే ఒక్కో అల చాలా దూరం వరకు కొనసాగుతూ ఉండడమే కారణం.

Published : 27 Apr 2016 00:57 IST

ఎంత పొడవైన అలలో!

సముద్రాలన్నాక అలలు రావడం సహజం. మరి ప్రపంచంలోనే పొడవైన అలలు ఏర్పడే చోటేదో తెలుసా? చూడాలనుంటే పెరూలోని ‘చికామా’ పట్టణానికి వెళ్లాలి.

* ఈ బీచ్‌ని దూరం నుంచి చూస్తే సముద్రంలో మెట్లలా కనిపిస్తాయి. ఎందుకంటే ఒక్కో అల చాలా దూరం వరకు కొనసాగుతూ ఉండడమే కారణం.

* ఈ బీచ్‌ పేరు చికామా సర్ఫ్‌. ఇక్కడ ఏర్పడే అలల్లో కొన్ని కిలోమీటరు పొడవుంటే, కొన్ని ఏకంగా నాలుగు కిలోమీటర్ల పొడవుగా ఏర్పడతాయి. అలా ఒకేసారి ఏడెనెమిది ఒకదాని వెంట ఒకటి వచ్చే సరికి అవన్నీ నీటి మెట్లలా భలే తమాషాగా కనిపిస్తాయి. ఒక్కో అలా మూడు నిమిషాలకు పైగా ఎగసి పడుతూ కనువిందు చేస్తుంది.

* ఇలా సుదీర్ఘమైన అలలు ఏర్పడడం వల్ల సరదా అంతా ఎవరికో తెలుసా? సర్ఫింగ్‌ చేసేవాళ్లకు.

* అలలు చాలా ఎత్తుకు ఎగిసే ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కానీ ఇలా ఎక్కువ పొడవైన అలలు వచ్చే ప్రదేశాలు చాలా అరుదు.

* ఈ పొడవైన అలలపై సర్ఫింగ్‌ చేయడానికి దేశదేశాల నుంచి ఇక్కడికి సర్ఫర్లు వస్తుంటారు. కొందరు వీటిపై గిన్నిస్‌ రికార్డులు కూడా సాధించారు. పెరూకే చెందిన క్రిస్టోబల్‌ డీ కొల్‌ అనే ఆయన సర్ఫింగ్‌ చేస్తూ ఒక అలపై 34 మలుపులు తిరిగి గిన్నిస్‌లోకి ఎక్కాడు.

* భౌగోళిక చర్యవల్ల ఏర్పడే ఈ సహజ వింతను చూడ్డానికి పెద్ద సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని