తేలియాడే వంతెనంట... ప్రపంచంలోనే పొడవంట!

ఒక వంతెన కొత్తగా ప్రారంభమైంది. అవ్వడంతోనే గిన్నిస్‌ రికార్డు కొట్టింది. అదే ‘ప్రపంచంలోనే పొడవైన తేలియాడే వంతెన’. పేరు ‘ఎవర్‌గ్రీన్‌ పాయింట్‌ ఫ్లోటింగ్‌

Published : 28 Apr 2016 01:01 IST

తేలియాడే వంతెనంట... ప్రపంచంలోనే పొడవంట!

ఒక వంతెన కొత్తగా ప్రారంభమైంది. అవ్వడంతోనే గిన్నిస్‌ రికార్డు కొట్టింది. అదే ‘ప్రపంచంలోనే పొడవైన తేలియాడే వంతెన’. పేరు ‘ఎవర్‌గ్రీన్‌ పాయింట్‌ ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌’. చూడాలంటే అమెరికాలోని వాషింగ్టన్‌ వెళ్లాలి.

* ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ అంటే కింద స్తంభాలకు బదులు 360 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు 28 అడుగుల ఎత్తుతో ఉండే 75 భారీ కాంక్రీటు పలకలు ఉంటాయి. వంతెన డెక్కు నీటిపై నుంచి 20 అడుగుల ఎత్తులో ఉంటుంది.

* నీటిపై 7,710 అడుగుల పొడవు, 116 అడుగుల వెడల్పుతో ఉండే ఈ వంతెనపై పాదచారులకు, వాహనాలకు ప్రత్యేకంగా ఆరు దారుల్ని ఏర్పాటుచేశారు. ఇది సియాటెల్‌ బెల్లెవూ నగరాలను కలుపుతుంది.

* 1963లోనే ఈ సరస్సుపై వంతెన కట్టారు. ఇప్పుడు దాన్నే పునరుద్ధరణ చేసి కొత్త వంతెన నిర్మించారన్నమాట. మునుపటిది నీటిపై 7,578 అడుగుల పొడవుంటే దాని కన్నా 132 అడుగుల ఎక్కువ పొడవుతో ఇప్పుడు కొత్త వారధి దాని రికార్డు తిరగ రాసింది. నిర్మాణానికి అయిదేళ్లు పట్టింది.

* గంటకు 143 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల్ని, భూకంపాల్ని తట్టుకునేలా వంతెనను దృఢంగా రూపొందించారు.

* పూర్తి నిర్మాణానికి 4.56 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని