కోటి దేవతల కొండ!

ఒకసారి శివుడు కోటి దేవతలను వెంటబెట్టుకుని కాశీకి ప్రయాణమయ్యాడు. మధ్యలో చీకటి పడగానే దేవతలంతా ఒకచోట పడుకున్నారు. మర్నాడు

Published : 30 Apr 2016 00:51 IST

కోటి దేవతల కొండ!

కసారి శివుడు కోటి దేవతలను వెంటబెట్టుకుని కాశీకి ప్రయాణమయ్యాడు. మధ్యలో చీకటి పడగానే దేవతలంతా ఒకచోట పడుకున్నారు. మర్నాడు సూర్యోదయానికి ముందే అందరూ నిద్రలేవాలని శివుడు ఆజ్ఞాపించాడు. కానీ ఉదయాన్నే ఒక్క తానుతప్ప ఎవరూ నిద్రలేవకపోవడంతో శంకరుడికి కోపం వచ్చి ‘మీరంతా శిలలుగా మారిపోండి’ అని శపించాడు. అలా ఒకరు తక్కువ కోటిమంది విగ్రహాలుగా మారిపోయారు.
* ఈ దేవతల విగ్రహాలను మీకూ చూడాలనుంటే త్రిపురలోని అగర్తలా దగ్గరున్న ‘ఉనకోటి’ పర్వతాలకు వెళ్లాల్సిందే.


* ఏటా ఏప్రిల్‌లో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. వేలాది మంది భక్తులు ఈ కొండల పైకి వచ్చి దేవతలను దర్శించుకుంటారు.
* ఉనకోటి అంటే కోటికి ఒక్కటి తక్కువ అని అర్థమట. పురాణకథ ప్రకారమే ఈ పేరొచ్చింది.


* ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కొండకే చెక్కిన వేలాది విగ్రహాలు భలే కనువిందు చేస్తాయి. వీటిల్లో 10 అడుగుల రూపాల నుంచి 50 అడుగుల ఎత్తయిన ఆకారాల వరకు ఉన్నాయి, మనం పూజించే గణపతి, దుర్గ, పార్వతి, భైరవుడు, దేవతల వాహనాలైన సింహం, నంది, పులి ఇలా ఇక్కడున్న ప్రతీ కొండ విగ్రహాలతో నిండి అబ్బురపరుస్తుంది.
* ఈ విగ్రహాలపై పరిశోధనలు చేస్తే ఇవి ఏడు నుంచి 12 శతాబ్దంలో చెక్కినవని తెలుస్తోంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని