మన రాతి తోట... వెనిస్‌కి వెళ్లిందంట!

అడుగు వేస్తే ఓ అద్భుత శిల్పం. ఎటు చూసినా కళాఖండాలే. అన్నీ కలిపితే వేలల్లో ఉంటాయి. ఈ సంగతులన్నీ చండీగఢ్‌లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ‘రాక్‌ గార్డెన్‌’వే. ఈ రాతి శిల్పాల ఉద్యానవనం త్వరలో....

Published : 03 May 2016 00:52 IST

మన రాతి తోట... వెనిస్‌కి వెళ్లిందంట!

డుగు వేస్తే ఓ అద్భుత శిల్పం. ఎటు చూసినా కళాఖండాలే. అన్నీ కలిపితే వేలల్లో ఉంటాయి. ఈ సంగతులన్నీ చండీగఢ్‌లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ‘రాక్‌ గార్డెన్‌’వే. ఈ రాతి శిల్పాల ఉద్యానవనం త్వరలో ఇటలీలో కూడా సందడి చేయనుంది. అదేంటీ గార్డెన్‌ను అక్కడికి ఎలా తీసుకెళతారు? అనేగా మీ సందేహం. వెనిస్‌ నగరంలో జరగనున్న 15వ అంతర్జాతీయ శిల్పకళా ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుత కళాఖండాల నమూనాల్ని చేసి పెడతారు. అందులో మన రాక్‌ గార్డెన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. మే నెలలో ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన నవంబరు వరకు ఉంటుంది.

* అసలు మన రాక్‌ గార్డెన్‌ను చూడాలంటే రెండు కళ్లూ చాలవు. ఎటుచూసినా అద్భుత శిల్పాలు కనువిందు చేస్తాయి. కడవెత్తుకుని నిలబడ్డ అందమైన అమ్మాయిలు, నాట్యం చేస్తున్న కళాకారులు, కొండ మీదున్న కోతులు, వరుసల్లో కూర్చున్న జీవులు ఇలా బోలెడు రూపాలు కొలువై ఉన్నాయి.

* ఈ రాతి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది నెక్‌ చంద్‌ అనే ఆయన. 1957లో 12 ఎకరాల స్థలంలో 18 ఏళ్లు నిరంతరం శ్రమించి ఈ వినూత్నమైన తోటను తయారుచేశాడు. పెద్ద పెద్ద రాళ్లనే ఆకట్టుకునే శిల్పాలుగా చెక్కి పెట్టాడు. ఈ రాతి ఉద్యానవాన్ని 1976లో ప్రారంభించారు. ప్రస్తుతం ఇది నలభై ఎకరాల విస్తీర్ణానికి పెరిగింది.

* రాళ్లతో పాటు గాజు, సిరామిక్‌ పదార్థాలు, భవనాల నిర్మాణంలో వచ్చే వ్యర్థ పదార్థాల్నే అందమైన ఆకృతుల్లో తీర్చిదిద్దిపెట్టారు.

* కళారూపాల మధ్యలో కృత్రిమ జలపాతాలూ ఉంటాయి.

* రోజూ ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య అయిదు వేలకుపైనే.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని