రోబో... రోబో... భవనం అబ్బో!

మీరెప్పుడైనా 20 అంతస్తుల ఎత్తుండే రోబోట్‌ను చూశారా? చూడకపోతే థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌కు పదండి. అక్కడ కనిపిస్తుందీ భారీ రోబో. నిజానికిది మరమనిషి ఆకారంలో ఉన్న భవనం. అక్కడివారంతా దీన్ని ‘రోబోట్‌ బిల్డింగ్‌’ అని పిలుస్తారు. ఈ భవన నిర్మాణాన్ని 1980లో మొదలెడితే 1986లో పూర్తయ్యింది. ఈ రోబో భవనం 20 అంతస్తులు ఉంది. ఇందులో బోలెడు ప్రత్యేకతలు ఉన్నాయి. పై భాగం కళ్లలా కనిపించేవి

Published : 06 May 2016 00:58 IST

రోబో... రోబో... భవనం అబ్బో!


మీరెప్పుడైనా 20 అంతస్తుల ఎత్తుండే రోబోట్‌ను చూశారా? చూడకపోతే థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌కు పదండి. అక్కడ కనిపిస్తుందీ భారీ రోబో.

* నిజానికిది మరమనిషి ఆకారంలో ఉన్న భవనం. అక్కడివారంతా దీన్ని ‘రోబోట్‌ బిల్డింగ్‌’ అని పిలుస్తారు.

* ఈ భవన నిర్మాణాన్ని 1980లో మొదలెడితే 1986లో పూర్తయ్యింది.

* ఈ రోబో భవనం 20 అంతస్తులు ఉంది. ఇందులో బోలెడు ప్రత్యేకతలు ఉన్నాయి. పై భాగం కళ్లలా కనిపించేవి కిటికీలు. అవి రాత్రిళ్లు ప్రత్యేకమైన కాంతులతో మెరుస్తుంటే అచ్చం రోబో కళ్లలానే అనిపిస్తాయి. పైన యాంటెన్నాలు కూడా ఏర్పాటుచేశారు. భవనం పక్కలకు భారీ బోల్టులు బిగించారు. అప్పట్లో ప్రపంచంలోనే అతిపెద్ద బోల్టులు ఇవే.

* దీన్ని ఒక బ్యాంకు ప్రధాన కార్యాలయంగా వాడుతున్నారు. లోపల కూడా రోబో ఆకారంలో ఉండే ఎన్నో వస్తువులు అబ్బురపరుస్తాయి.

* మరి ఇలా కట్టాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? సుమిత్‌ జుమ్‌సాయి అనే భవన శిల్పకారుడికి. వీళ్ల అబ్బాయి ఒక రోజు రోబో బొమ్మతో ఆడుకుంటుంటే అదే ఆకారంలో భవనం కట్టాలనిపించింది.

* అప్పట్లోనే దీని నిర్మాణానికి దాదాపు రూ. 50 కోట్లకుపైగా వెచ్చించారట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు