ప్రపంచంలోనే ప్రత్యేక దేశం!

రాజధాని: వాటికన్‌సిటీ జనాభా: 839 విస్తీర్ణం: 0.44 చదరపు కిలోమీటర్లు భాషలు: ఇటాలియన్‌ కరెన్సీ: యూరో

Published : 08 May 2016 01:21 IST

ప్రపంచంలోనే ప్రత్యేక దేశం!

రాజధాని: వాటికన్‌సిటీ
జనాభా: 839
విస్తీర్ణం: 0.44 చదరపు కిలోమీటర్లు
భాషలు: ఇటాలియన్‌
కరెన్సీ: యూరో వాటికన్‌సిటీ

 


 

* వాటికన్‌సిటీ రోమ్‌ నగర ప్రాంతంలోనే ఉన్న స్వతంత్ర రాజ్యం.
* వైశాల్యం, జనాభా పరంగా ప్రపంచంలో ఇదే అతి చిన్న దేశం.
* వాటికన్‌సిటీలో రైళ్లు 0.86 కిలోమీటర్ల దూరం మాత్రం ప్రయాణం చేస్తాయి.

 


 

 

* క్రైస్తవులు పవిత్రంగా భావించే ఈ ప్రాంతంలో పోప్‌ నివసిస్తారు.
జెండా: తెలుపు రంగుపై ఉండే చిహ్నంలో ఉన్న బంగారు, వెండి తాళం చెవులు బైబిల్‌లో ఉన్న స్వర్గపు తాళం చెవులను సూచిస్తాయి.

 


 

* ఇక్కడున్న మ్యూజియం చాలా పెద్దది. ఇందులోని పెయింటింగ్స్‌ని చూడ్డానికి ఒక్కో వస్తువుకు ఒక్కో నిమిషం కేటాయించినా అన్నీ పూర్తిచేయడానికి దాదాపు నాలుగేళ్ల సమయం పడుతుంది!
* ఇక్కడున్న రేడియో స్టేషన్‌లో 20 భాషల్లో ప్రసారాలు జరుగుతాయి.
*దీనికి యునెస్కో వారసత్వపు ప్రాంతంగా గుర్తింపు ఉంది.

 


 

 

* ఇక్కడ ఎన్నో హాలీవుడ్‌ సినిమాల్ని చిత్రీకరించారు.
* ఇటాలియన్లు ప్రభుత్వానికి చెల్లించే పన్నుల్లో ఎనిమిది శాతం పన్ను వాటికన్‌సిటీకి విరాళంగా ఇవ్వడానికి వీలుంటుంది.
* ఇక్కడ ప్రత్యేక స్టాంపులు, నాణేలు చలామణిలో ఉంటాయి.
* మతవిశ్వాసాలకు సంబంధం లేకుండా ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు.

 


 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని