కాలం తమాషా!

విశ్వం పుట్టి కోటానుకోట్ల ఏళ్లయ్యిందని తెలుసు. మరి విశ్వం ఆవిర్భవించిన రోజు నుంచి నేటి వరకు కాలాన్ని ఒక ఏడాదిలో సర్దామనుకోండి. అప్పుడు కాలం లెక్క తమాషాగా ఇలా ఉంటుంది.

Published : 10 May 2016 00:55 IST

కాలం తమాషా!

విశ్వం పుట్టి కోటానుకోట్ల ఏళ్లయ్యిందని తెలుసు. మరి విశ్వం ఆవిర్భవించిన రోజు నుంచి నేటి వరకు కాలాన్ని ఒక ఏడాదిలో సర్దామనుకోండి. అప్పుడు కాలం లెక్క తమాషాగా ఇలా ఉంటుంది.

జనవరి 1 - బిగ్‌బ్యాంగ్‌ ఆవిర్భావం

జనవరి 10 - తొలి నక్షత్రం పుట్టుక

జనవరి 13 - మొదటి చిన్న గెలాక్సీ

మార్చి 15 - మన పాలపుంత జననం కానీ ఇంకా సూర్యుడు ఏర్పడలేదు.

ఆగస్టు 31 - సూర్యుడి జననం (సౌర పళ్లెం నుంచే కొంత కాలానికి భూమి కూడా ఏర్పడింది)

సెప్టెంబరు 21 - జీవం పుట్టుక

నవంబరు 9 - జీవులు కదలడం, తినడం లాంటి పనులు మొదలెట్టాయి.

డిసెంబరు 17 - జీవం నీటి నుంచి నేలపైకి వచ్చింది.

డిసెంబరు 28 - భూమిపై మొదటి పువ్వు పూసింది.  
 

డిసెంబరు 30 - ఒక ఆస్టరాయిడ్‌ భూమిని తాకి డైనోసార్లు అంతరించిపోయాయి

డిసెంబరు 31 - మనకు తెలిసిన చరిత్ర అంతా జరిగింది ఈ రోజే. అదీ 14 సెకన్ల వ్యవధిలో మాత్రమే.

13 సెకన్ల క్రితం - మనిషి వ్యవసాయం పనులు, జంతువుల పెంపకం, కళల గురించి తెలుసుకున్నాడు.

6 సెకన్ల క్రితం: బుద్ధుడు జన్మించాడు

5 సెకన్ల క్రితం: ఏసుక్రీస్తు జననం

ఒక సెకను ముందు: భూమి విశ్వానికి కేంద్రం కాదని తెలుసుకున్నాం. ఈ సెకనుకు చివరలో చంద్రుడిపై మనిషి కాలుమోపడం, తర్వాత ఈ రోజు వరకు ఈ సెకను చివరే జరిగింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని