నదిపై నడక... భలే వేడుక!

పచ్చని చెట్ల మధ్య జలజల పారుతున్న నదిపై నడుస్తుంటే? ఈ ఆలోచనే గమ్మత్తుగా ఉంది కదా. అయినా నీటిపై నడవటమేంటీ?అనుకుంటున్నారా? అయితే వివరాలు చదివేయండి.

Published : 13 May 2016 01:08 IST

నదిపై నడక... భలే వేడుక!

పచ్చని చెట్ల మధ్య జలజల పారుతున్న నదిపై నడుస్తుంటే? ఈ ఆలోచనే గమ్మత్తుగా ఉంది కదా. అయినా నీటిపై నడవటమేంటీ?అనుకుంటున్నారా? అయితే వివరాలు చదివేయండి.

* చైనాలోని హుబే ప్రావిన్స్‌లోని గ్జావానేన్‌ కౌంటీలో ఈమధ్యే ఓ వింతైన పాదచారుల వంతెన ప్రారంభించారు. పర్వతాల మధ్య ఓ లోయలో నీలం రంగులో మెరిసిపోతూ ప్రవహించే ఓ నదిలో దీన్ని ఏర్పాటుచేశారు.

* చెక్కతో తయారు చేసి నదికి సరిగ్గా మధ్యలో ఏర్పాటు చేశారు. మొత్తం 1640 అడుగుల పొడవు ఉంటుంది.

* పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఈ లోయను, ప్రకృతి అందాల్ని చూడ్డానికే దీన్ని నిర్మించారు.

* ఇంతకు మునుపు సందర్శకులు నదిలో పడవల ద్వారా వెళ్లి ఈ ప్రాంతాన్ని చుట్టి వచ్చేవారు.

* ఈ వంతెనపై వెళుతుంటే అచ్చంగా నదిపై నడుస్తున్న వింత అనుభూతి కల్గుతుంది.

* ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే పర్యటకుల సంఖ్య భారీగా పెరిగిపోయింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని