అరటిపళ్లు... చర్చిలు... అక్కడే ఎక్కువ!

రాజధాని: కింగ్‌స్టన్‌ జనాభా: 29,50,210 విస్తీర్ణం: 10,991 చదరపు కిలోమీటర్లు భాషలు: ఆంగ్లం కరెన్సీ: జమైకన్‌ డాలర్‌ జెండా: నలుపు రంగు కష్టాలను అధిగమించడానికి సూచన అయితే, బంగారువర్ణం సహజ సంపదకూ, సూర్యకాంతికీ గుర్తు, ఆకుపచ్చ రంగు ఆశాభావానికీ, వ్యవసాయ వనరులకూ సూచన.

Published : 22 May 2016 00:56 IST

అరటిపళ్లు... చర్చిలు... అక్కడే ఎక్కువ!


 

 

రాజధాని: కింగ్‌స్టన్‌

జనాభా: 29,50,210
విస్తీర్ణం: 10,991
చదరపు కిలోమీటర్లు
భాషలు: ఆంగ్లం
కరెన్సీ: జమైకన్‌ డాలర్‌

 


 

జెండా

నలుపు రంగు కష్టాలను అధిగమించడానికి సూచన అయితే, బంగారువర్ణం సహజ సంపదకూ, సూర్యకాంతికీ గుర్తు, ఆకుపచ్చ రంగు ఆశాభావానికీ, వ్యవసాయ వనరులకూ సూచన.

* జమైకా కరీబియన్‌ సముద్రంలో ఉన్న ద్వీప దేశం. సార్వభౌమ దేశమే అయినా లాంఛన చక్రవర్తిగా బ్రిటన్‌ ఎలిజబిత్‌ వ్యవహరిస్తారు.


 

* ప్రపంచంలోనే అత్యధిక చర్చిలున్న ప్రాంతమిది. 1600 చర్చిలతో గిన్నిస్‌ రికార్డుకెక్కింది.

* ఉత్తర అమెరికా, కెనడాల తర్వాత అత్యధిక శాతం ప్రజలు ఆంగ్లం మాట్లాడేది ఇక్కడే.

* 116 దేశాల్లోని ప్రజలు వీసా లేకున్నా జమైకాకు వెళ్లవచ్చు. ఇలా అనుమతి లభించిన దేశాల్లో మన దేశమూ ఉంది.

 

 


* ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సీతాకోక చిలుక ‘స్వాలోటేల్‌’ నివాసం ఈ దేశమే.

 

 


* ఇక్కడ కేవలం ఎనిమిది జాతుల పాములు ఉంటాయి. అవి కూడా విషరహితమైనవి. 1872లో చెరకు తోటలను ధ్వంసం చేస్తున్న ఎలుకల్ని చంపడానికి ఈ ప్రాంతానికి ముంగిసల్ని తీసుకొచ్చారట. ఎలుకలతో పాటు అవి పాముల పని కూడా పట్టడంతో ఈ దీవిలో పాముల సంఖ్య బాగా తగ్గిపోయింది.

 


 

* ప్రఖ్యాత పరుగుల వీరులు ఉస్సేన్‌ బోల్ట్‌, యోహాన్‌ బ్లేక్‌లు ఇక్కడి వారే.


 

* 200కి పైగా ఆర్కిడ్‌ పూల జాతులున్నాయి.

* ప్రపంచంలో అత్యధికంగా అరటి పండ్లని ఎగుమతి చేసే దేశం ఇదే.

* జేమ్స్‌బాండ్‌ సృష్టికర్త ఇయాన్‌ ఫ్లెమింగ్‌ జమైకాలోనే ‘గోల్డెన్‌ఐ’ పేరిట సొంత ఇల్లు కట్టుకున్నారు.

* ప్రాచుర్యం పొందిన ‘రెగే’ సంగీత శైలి పుట్టింది ఇక్కడే.

* ఈ ద్వీపదేశం చిన్నదే అయినా పర్యటకానికి పేరు పొందింది. ఏటా పదిలక్షలకు పైగా సందర్శకులు వస్తుంటారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని