వింత మ్యూజియం చూసుకో! ఉప్పూకారం జల్లుకో!!

విద్యుత్తు బల్బులోంచి ఉప్పు వేసుకోవచ్చు. పండ్ల నుంచి మిరియాల పొడి చల్లుకోవచ్చు. ఏంటీ ఇదంతా అనుకుంటున్నారా? ‘సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ షేకర్స్‌’ మ్యూజియానికి వెళితే మీకే తెలుస్తుంది. అవసరమైనపుడు చల్లుకునే ఉప్పు డబ్బా, మిరియాల పొడి డబ్బా అనగానే ఓ రూపం వూహించుకుంటాం. కానీ ఇలాంటివెన్నో మనకు వూహలను మించి వింత రూపాల్లో అబ్బురపరుస్తాయి. ప్రపంచంలోనే ఏకైక సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ షేకర్స్‌ మ్యూజియం ఇది.

Updated : 08 Dec 2022 19:50 IST

* ఇది అమెరికాలోని గాట్లిన్‌ బర్గ్‌లో ఉంది.

* ఇందులో అడుగుపెడితే చాలు... మనం ఇదివరకు చూడని బోలెడు ఆకారాల్లో ఉప్పు, మిరియాల పొడి డబ్బాలు కనిపిస్తాయి. మొత్తం 20,000 జతలు ఉంటాయి.

* రకరకాల జంతువులు, పండ్లు, కూరగాయలు, కార్టూన్‌ పాత్రలు, బల్బులు, టిన్నులు, పోస్టు బాక్సులు, ప్రముఖుల వేషాల్లో ఇలా ఎన్నో ఆకట్టుకునే రూపాల్లో కనువిందుచేస్తాయి. ఇవన్నీ వేలెడంత నుంచి అడుగు పరిమాణం వరకు ఉంటాయి.

* నిజమైన బర్గర్లు, శాండ్‌విచ్‌లు, రొట్టె ముక్కల్నే ఉప్పు, మిరియాల డబ్బాలుగా చేసినట్టు భలేగా ఉంటాయవి.

* ఇందులో కలప, గాజు, ప్లాస్టిక్‌ పదార్థాలతో పాటు బంగారం, వెండి వంటిలోహాలతో చేసినవీ ఉన్నాయి. 1980 నాటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన వైవిధ్యమైన నమూనాలన్నీ ఉన్నాయి.

* అసలు ఈ మ్యూజియాన్ని ఎవరు పెట్టారు? ఆండ్రియా లూడెన్‌ అనే ఆవిడ. సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ డబ్బాలంటే ఇష్టంతో ఎన్నో ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వింత ఆకారాల్ని సేకరిస్తోంది. వేలాదిగా పోగవడంతో వాటితో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని