ఎన్ని వింతలో! ఎన్ని ప్రత్యేకతలో!

జెండా: ఎరుపు రంగు సైనికుల ధైర్యానికి సూచిక, ఆకుపచ్చరంగు సారవంతమైన లక్షణానికి, పసుపు ఖనిజ సంపదకు గుర్తు. రాజధాని: సుక్రె, జనాభా: 1,14,10,651, విస్తీర్ణం: 10,98,581 చదరపు కిలోమీటర్లు, భాషలు: స్పానిష్‌, క్వెచువా, అయిమారా, కరెన్సీ: బొలీవియానొ * బొలీవియా దేశం దక్షిణ అమెరికా ఖండపు మధ్య ప్రాంతంలో ఉంటుంది.

Published : 29 May 2016 01:06 IST

ఎన్ని వింతలో! ఎన్ని ప్రత్యేకతలో!

 



బొలీవియా

 


 

జెండా:

ఎరుపు రంగు సైనికుల ధైర్యానికి సూచిక, ఆకుపచ్చరంగు సారవంతమైన లక్షణానికి, పసుపు ఖనిజ సంపదకు గుర్తు.

రాజధాని: సుక్రె, జనాభా: 1,14,10,651, విస్తీర్ణం: 10,98,581 చదరపు

కిలోమీటర్లు, భాషలు: స్పానిష్‌, క్వెచువా, అయిమారా, కరెన్సీ: బొలీవియానొ


* బొలీవియా దేశం దక్షిణ అమెరికా ఖండపు మధ్య ప్రాంతంలో ఉంటుంది.

* ప్రపంచంలోనే ఎత్తయిన ‘టిటికాకా’ సరస్సు ఉన్నది ఇక్కడే. సముద్ర మట్టానికి 3,810 మీటర్ల ఎత్తున్న ఈ సరస్సును దాటడానికి ఆరు గంటల సమయం పడుతుంది. అత్యంత లోతైన సరస్సుల్లో ఇదీ ఒకటి.


* ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రెండు నగరాలు ఈ దేశంలోనే ఉన్నాయి. ఒకటి పోటోస్‌, రెండోది లా పాజ్‌ నగరం.

* లాపాజ్‌కు దగ్గర్లో ఉండే ‘కమినో డె లాస్‌ యుంగస్‌ రోడ్డు’ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. ఈ రహదారిపై ఏటా వందలాది ప్రమాదాలు జరుగుతాయి.


 

* ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఇనుప ఖనిజాల నిల్వలు ఉన్నాయి.

* మొట్టమొదటి అధ్యక్షుడు సైమన్‌ బొలీవర్‌ పేరు మీదుగా ఈ దేశానికి బొలీవియా అని పెట్టారు.

* ప్రపంచంలోనే అతి పెద్ద సీతాకోక చిలుకల సంరక్షణ కేంద్రం ఇక్కడే ఉంది.

* అత్యంత తడిగా ఉండే ప్రాంతమిది. ఎందుకంటే ఏడాదిలో భారీగా ఎనిమిది మీటర్లకుపైగా వర్షపాతం కురుస్తుంది.

* ఇక్కడ 30 అధికారిక భాషలున్నాయి.

 


* ‘సలార్‌ డి ఉయుని’ పేరిట ప్రపంచంలోనే అతి పెద్ద ఉప్పు క్షేత్రం ఉంది. ఉప్పు ఎడారిగా పిలిచే ఈ ప్రదేశం 11 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపు 64 మిలియన్‌ టన్నుల ఉప్పు ఉంటుంది. పాలాసియోడి సాల్‌ పేరిట ఇక్కడ అచ్చంగా ఉప్పుతో కట్టిన హోటల్‌ ఉంటుంది. ఈ వింతప్రాంతాన్ని చూడ్డానికి ఏటా లక్షల్లో సందర్శకులు వస్తుంటారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని