జర్రున జారీ... కలప సవారీ!

దెబ్బలు తగులుతాయ్‌. చేతులు, కాళ్లు విరుగుతాయ్‌. అయినా అదొక కోలాహలంతో సాగే ఉత్సవం. ప్రపంచంలోనే ప్రమాదకరమైన పండగల్లో ఒకటి. శతాబ్దాల నుంచి జరుపుకుంటున్న వేడుక అది. పాల్గొనడానికే కాదు చూడ్డానికీ వేలాది మంది వస్తారు. ఇంతకీ ఏంటా విశేషాలు? ఏమా పండగ? * యాభై అడుగుల పొడవు, 10 టన్నుల బరువున్న పెద్దపెద్ద దుంగల్ని తీసుకొస్తారు. వాటికి కొమ్ముల్లా రెండువైపులా బలమైన కర్రల్ని అమర్చుతారు. ఆ దుంగల్నే రంగురంగులతో చక్కగా ముస్తాబు చేస్తారు. పొడవైన తాళ్లు కడతారు. కొంతమంది దుంగలపై కూర్చుంటారు. మరి కొంత మంది తాళ్లతో వాటిని లాగుతుంటారు. ఎత్తయిన కొండల మీదనుంచి ఆ దుంగల్ని కిందికి దొర్లిస్తుంటే ఒక్కసారిగా అవి కిందకు జారుతూ ఉంటాయి. వాటిపై కూర్చున్నవాళ్లంతా చెల్లా చెదురుగా కేకలు వేస్తూ కిందకు పడిపోతుంటారు. ఇదంతా జపాన్‌లో జరిగే ఒన్‌బషిరా ఫెస్టివల్‌ విశేషాలు.

Published : 31 May 2016 01:04 IST

జర్రున జారీ... కలప సవారీ!

దెబ్బలు తగులుతాయ్‌. చేతులు, కాళ్లు విరుగుతాయ్‌. అయినా అదొక కోలాహలంతో సాగే ఉత్సవం. ప్రపంచంలోనే ప్రమాదకరమైన పండగల్లో ఒకటి. శతాబ్దాల నుంచి జరుపుకుంటున్న వేడుక అది. పాల్గొనడానికే కాదు చూడ్డానికీ వేలాది మంది వస్తారు. ఇంతకీ ఏంటా విశేషాలు? ఏమా పండగ?

* యాభై అడుగుల పొడవు, 10 టన్నుల బరువున్న పెద్దపెద్ద దుంగల్ని తీసుకొస్తారు. వాటికి కొమ్ముల్లా రెండువైపులా బలమైన కర్రల్ని అమర్చుతారు. ఆ దుంగల్నే రంగురంగులతో చక్కగా ముస్తాబు చేస్తారు. పొడవైన తాళ్లు కడతారు. కొంతమంది దుంగలపై కూర్చుంటారు. మరి కొంత మంది తాళ్లతో వాటిని లాగుతుంటారు. ఎత్తయిన కొండల మీదనుంచి ఆ దుంగల్ని కిందికి దొర్లిస్తుంటే ఒక్కసారిగా అవి కిందకు జారుతూ ఉంటాయి. వాటిపై కూర్చున్నవాళ్లంతా చెల్లా చెదురుగా కేకలు వేస్తూ కిందకు పడిపోతుంటారు. ఇదంతా జపాన్‌లో జరిగే ఒన్‌బషిరా ఫెస్టివల్‌ విశేషాలు.

* ఇదంతా చదివి ‘ఇదెక్కడి పండగరా బాబూ’ అంటూ తీసి పారేయకండి. దీనికి ఎంత చరిత్ర ఉందో తెలుసా? ఏకంగా 1200 ఏళ్లు! ఇక్కడి ప్రాచీన షింటో సంప్రదాయం ప్రకారం ఆరేళ్లకోసారి జరుపుతున్నారు. దేవాలయాల్ని పవిత్రంగా చేసే ప్రక్రియలో భాగంగా ఈ వింత పండగ మొదలైంది.

* ఇక్కడి నాగానోలోని లేక్‌సువా దగ్గర నుంచి ఆలయం వరకు 16 దుంగల్ని దాదాపు 10 కిలోమీటర్ల దూరం వరకు లాగుతారు. గాయాలవుతాయని తెలిసినా వేలాది మంది ఇందులో సాహసంతో పాల్గొంటారు. మధ్యలో కొండల మీదుగా సర్రు సర్రున లాగుతూ జోరుగా తీసుకెళుతుంటే చూసేవారికే చెమటలు పట్టేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని