బుల్లి మ్యూజియం... ఎంతో అద్భుతం!

అదో పెద్ద మ్యూజియం. వేలాది వస్తువుల ప్రదర్శనలు ఉంటాయి. కానీ అదిప్పుడు బుల్లిగా మారిపోయింది. అందులోని వస్తువులు, శిల్పాలు కూడా సూక్ష్మ రూపంలోకి వచ్చాయి. అరె ఎలాగబ్బా? అంటే వివరాలు చదివేయండి. * స్కాట్లాండ్‌లోని జాతీయ మ్యూజియం చూడ్డానికి ఇప్పుడు వేలాది మంది వస్తున్నారు. ఎందుకంటే అచ్చంగా అదే నమూనాతో అందులో అలాంటి మ్యూజియాన్నే ఏర్పాటుచేశారు. 3.5 మీటర్ల పరిమాణంలో దీన్ని తీర్చిదిద్దారు. దేనితో తయారు చేశారు అంటే? లెగో బ్రిక్స్‌తో. బొమ్మల్ని తయారుచేసుకునే లెగో ఇటుకలు తెలిసే ఉంటుంది. వాటితో చేసిన మినియేచర్‌ మ్యూజియం భవంతి అన్నమాట.

Published : 06 Jun 2016 03:33 IST

బుల్లి మ్యూజియం... ఎంతో అద్భుతం!

అదో పెద్ద మ్యూజియం. వేలాది వస్తువుల ప్రదర్శనలు ఉంటాయి. కానీ అదిప్పుడు బుల్లిగా మారిపోయింది. అందులోని వస్తువులు, శిల్పాలు కూడా సూక్ష్మ రూపంలోకి వచ్చాయి. అరె ఎలాగబ్బా? అంటే వివరాలు చదివేయండి.

* స్కాట్లాండ్‌లోని జాతీయ మ్యూజియం చూడ్డానికి ఇప్పుడు వేలాది మంది వస్తున్నారు. ఎందుకంటే అచ్చంగా అదే నమూనాతో అందులో అలాంటి మ్యూజియాన్నే ఏర్పాటుచేశారు. 3.5 మీటర్ల పరిమాణంలో దీన్ని తీర్చిదిద్దారు. దేనితో తయారు చేశారు అంటే? లెగో బ్రిక్స్‌తో. బొమ్మల్ని తయారుచేసుకునే లెగో ఇటుకలు తెలిసే ఉంటుంది. వాటితో చేసిన మినియేచర్‌ మ్యూజియం భవంతి అన్నమాట.

* ఈ కళాఖండాన్ని వారెన్‌ ఎల్స్‌మోర్‌ అనే కళాకారుడు ఎంతో శ్రమించి రూపొందించాడు. విక్టోరియన్‌ శైలిలో నిర్మించిన స్కాట్లాండ్‌ జాతీయ మ్యూజియం భవనపు 150 ఏళ్ల ఉత్సవం సందర్భంగా ఈ బుల్లి మ్యూజియాన్ని తయారుచేశాడు.

* దీని నిర్మాణానికి మొత్తం 90 వేల లెగో బ్రిక్స్‌ వాడారు. 350 గంటల సమయం పట్టింది.

* సూక్ష్మనమూనాతో చేసిన ఈ లెగో మ్యూజియంలోనూ అసలైన మ్యూజియంలోలా టైరనోసారస్‌ రాకాసిబల్లి, ఫార్ములా కారు వంటి రకరకాల శిల్పాల్ని కూడా చేసిపెట్టాడు. భవనం అంతస్తులు, మెట్లతో పాటు మ్యూజియానికి వచ్చే సందర్శకుల రూపాల్ని కూడా సూక్ష్మ నమూనాలతో చేసిపెట్టాడు వారెన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని