సముద్రమా... ఈరోజు నీదే సుమా!

మనకు పుట్టిన రోజులున్నట్టే సముద్రాలకూ ఓ రోజు ఉంది. భూమిపై 71 శాతం విస్తరించి ఉన్న సాగరాల గౌరవార్ధం ఏడాదిలో ఒక రోజును కేటాయించారు. ఏటా జూన్‌ ఎనిమిదిన ‘వరల్డ్‌ ఓషన్స్‌ డే’గా జరుపుతారు. సముద్రాలు కాలుష్య రహితంగా ఉంటేనే, భూమిపై మన మనుగడ....

Published : 08 Jun 2016 01:31 IST

సముద్రమా... ఈరోజు నీదే సుమా!

మనకు పుట్టిన రోజులున్నట్టే సముద్రాలకూ ఓ రోజు ఉంది. భూమిపై 71 శాతం విస్తరించి ఉన్న సాగరాల గౌరవార్ధం ఏడాదిలో ఒక రోజును కేటాయించారు. ఏటా జూన్‌ ఎనిమిదిన ‘వరల్డ్‌ ఓషన్స్‌ డే’గా జరుపుతారు. సముద్రాలు కాలుష్య రహితంగా ఉంటేనే, భూమిపై మన మనుగడ బాగుంటుందనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా వేలాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి ఈ సందర్భంగా సముద్రాల ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా!


* 1992 బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో జరిగిన ‘ఎర్త్‌ సమ్మిట్‌’లో సాగర దినోత్సవం ఉండాలని కెనడా సూచించింది. అపారమైన వనరుల్ని మనకు అందిస్తున్నందుకు కృతజ్ఞత తెలపడానికి అధికారికంగా 2008 నుంచీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ వస్తున్నారు.

* భూమిపైన ఉన్న జీవజాతుల్లో 90 శాతం సముద్రాల్లోనే ఉన్నాయి.


* 1992 బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో జరిగిన ‘ఎర్త్‌ సమ్మిట్‌’లో సాగర దినోత్సవం ఉండాలని కెనడా సూచించింది. అపారమైన వనరుల్ని మనకు అందిస్తున్నందుకు కృతజ్ఞత తెలపడానికి అధికారికంగా 2008 నుంచీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ వస్తున్నారు.

* భూమిపైన ఉన్న జీవజాతుల్లో 90 శాతం సముద్రాల్లోనే ఉన్నాయి.


* తీరప్రాంతాల కాలుష్యంతో జీవరాశులకు వచ్చే వ్యాధులు, మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏడాదికి 12.8 బిలియన్‌ డాలర్ల భారాన్ని కల్గిస్తోంది.

* ఒక దేశం నుంచి మరో దేశానికి 90 శాతం వాణిజ్య సరకు రవాణా సముద్రాల ద్వారానే జరుగుతోంది.


* ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్ల జనాభా ప్రధానంగా సముద్రంలో దొరికే ఆహారంపైనే ఆధారపడి ఉన్నారు.


ముద్రాలు గత వందేళ్లుగా 10 నుంచి 25 సెంటీమీటర్లు ముందుకు వస్తున్నాయి. ఒకవేళ భూమిపై ఉన్న మంచు అంతా కరిగిపోతే అవి ఏకంగా 66 మీటర్ల ముందుకు వస్తాయిట.


ప్రపంచంలో అన్నింటికంటే లోతైన ప్రదేశం మెరియానా ట్రెంచ్‌. ఇది పసిఫిక్‌ మహాసముద్రంలో ఉంది. దీని అత్యధిక లోతు 35,838 అడుగులు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని