తేనె ద్వీపం...ఎంతో అద్భుతం!

మాల్టా ద్వీప దేశం మధ్యధరా సముద్రంలో ఐరోపా, ఉత్తర ఆఫ్రికా మధ్యలో ఉంది. ఇది కొన్ని ద్వీపాల సమూహం. ఇందులో ప్రధానమైన ద్వీపం మాల్టాతోపాటు గోజో, కోమినో అనే చిన్న ద్వీపాలు, నివాసయోగ్యంలేని అతిచిన్న ద్వీపాలు కూడా ఉన్నాయి.

Published : 12 Jun 2016 01:41 IST

తేనె ద్వీపం...ఎంతో అద్భుతం!

* రాజధాని: వాలెట్టా
జనాభా: 4,45,426
విస్తీర్ణం: 316 చ.కి.మీ
భాషలు: ఆంగ్లం, మాల్టీస్‌
కరెన్సీ: యూరో

 


 

మాల్టా ద్వీప దేశం మధ్యధరా సముద్రంలో ఐరోపా, ఉత్తర ఆఫ్రికా మధ్యలో ఉంది. ఇది కొన్ని ద్వీపాల సమూహం. ఇందులో ప్రధానమైన ద్వీపం మాల్టాతోపాటు గోజో, కోమినో అనే చిన్న ద్వీపాలు, నివాసయోగ్యంలేని అతిచిన్న ద్వీపాలు కూడా ఉన్నాయి.
విస్తీర్ణం, జనాభా పరంగా ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో ఇదీ ఒకటి.
ప్రాచీనులు దీన్నే ‘మెలిటా’గా పిలిచేవారు. అంటే తేనె ద్వీపమని అర్థం.


జెండా: ఎరుపు, తెలుపు రంగులతో ఉండే ఈ దేశ పతాకం యూకే దేశ చిహ్నంతో ఉండటం వల్ల ప్రత్యేకమైందిగా భావిస్తారు.
ఇక్కడ 1980లో ‘పొపెయే’ అనే చిత్రం కోసం అందమైన ఇళ్లతో ఒక గ్రామాన్ని నిర్మించారు. ‘పొపెయే విలేజ్‌’గా పిలిచే ఈ గ్రామం మంచి పర్యటక ప్రాంతం.


వాలెట్టా దగ్గర్లో ఉండే ‘గ్రాండ్‌ హార్బర్‌’ ప్రపంచంలోనే సహజంగా ఏర్పడిన లోతైన నౌకాశ్రయం.
ఇక్కడుండే గ్యాన్‌టిజ, అయిదు వేల ఏళ్లనాటి హగర్‌ కిమ్‌ దేవాలయాలు ఈజిప్టు పిరమిడ్ల కన్నా పురాతనమైనవి.
ఈ దేశ రాజధాని వాలెట్టా ప్రముఖ చారిత్రక నగరం.


ఇక్కడ పడవలకు మెరిసే రంగులతో కళ్ల బొమ్మలు వేస్తారు. సముద్రపు చెడును, దురదృష్టాన్ని పోగొట్టడానికే ఈ ఆచారం.
గోజో ద్వీప దేశంలో ‘అజూరే విండో’ అనే సున్నపురాయి తోరణం ప్రసిద్ధి చెందినది. ఇది ఎన్నో సినిమాల్లో కనిపిస్తుంటుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు