ప్రపంచంలోనే స్వచ్ఛమైన సరస్సు!

అదో సరస్సు. పేరు బ్లూ లేక్‌. దీన్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తుంటారు. హెలీకాప్టర్‌లు వేసుకొచ్చి మరీ పై నుంచి చూస్తుంటారు. ఇంతకీ ఈ సరోవరం ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రపంచంలోనే స్వచ్ఛమైన సహజ సిద్ధమైన కొలను.

Published : 16 Jun 2016 01:36 IST

ప్రపంచంలోనే స్వచ్ఛమైన సరస్సు!

అదో సరస్సు. పేరు బ్లూ లేక్‌. దీన్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తుంటారు. హెలీకాప్టర్‌లు వేసుకొచ్చి మరీ పై నుంచి చూస్తుంటారు. ఇంతకీ ఈ సరోవరం ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రపంచంలోనే స్వచ్ఛమైన సహజ సిద్ధమైన కొలను.

* న్యూజిలాండ్‌లోని నెల్సన్‌ లేక్స్‌ నేషనల్‌ పార్కులో ఉందిది.

* నీలం, వూదా రంగుల్లో కనిపించే ఈ సరస్సు స్వచ్ఛమైన నీళ్లతో నిండి ఉంటుంది. పైనుంచి చూస్తే 80 మీటర్ల లోతు వరకు పారదర్శకంగా కనిపిస్తుంది. అంటే దాదాపు 262 అడుగుల లోతు వరకున్న నాచు, చిన్నచిన్న నీటి మొక్కలు, జలచరాలు ఇలా సరస్సు అడుగుభాగంలో ఉండే ప్రతిదాన్నీ అత్యంత స్పష్టంగా చూడొచ్చు.

* దీన్నే ‘రోటోమైరెవెనువా’ అనే పేరుతో పిలుస్తారు.

* ఇక్కడి స్థానిక తెగల వారు ఈ అద్భుతమైన సరోవరాన్ని పవిత్రంగా భావిస్తారు. అందుకే ఇక్కడ ఈత కొట్టడం, చేపలు పట్టడం వంటివి చేయడానికి అనుమతి ఉండదు.

* ‘న్యూజిలాండ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వాటర్‌ అండ్‌ అట్మాస్పియరిక్‌ రిసెర్చ్‌’ వాళ్లు చేసిన పరిశోధనలో ఈ సరస్సు స్వచ్ఛత సంగతి తేటతెల్లం అయ్యింది.

* దగ్గర్లోని హిమానీనదం సరస్సు నుంచి ఈ బ్లూ లేక్‌కు నీళ్లు వస్తుంటాయి. దారి మధ్యలో ఎత్తయిన నేల మీద నుంచి ప్రవహిస్తున్నపుడు ఆ నీరు వడపోతకు గురై మలినాలన్నీ పోయి పరిశుభ్రం అవుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని