మొసళ్ల సాక్షిగా సాహస విన్యాసాలు!

సన్నని వంతెనపై నడుచుకుంటూ వెళతారు. రయ్యిమంటూ చక్రాలున్న చెక్కపై జారుతారు. తాడు పట్టుకుని ఒక్కసారిగా ఈ మూల నుంచి ఆ మూలకు వెళతారు. ఇంతే అయితే ఎవరైనా చేస్తారేమో కానీ అసలు ప్రత్యేకత ఏంటో తెలుసా? కింద నోళ్లు తెరుచుకున్న మొసళ్లు ఉంటాయి.

Published : 20 Jun 2016 00:58 IST

మొసళ్ల సాక్షిగా సాహస విన్యాసాలు!

న్నని వంతెనపై నడుచుకుంటూ వెళతారు. రయ్యిమంటూ చక్రాలున్న చెక్కపై జారుతారు. తాడు పట్టుకుని ఒక్కసారిగా ఈ మూల నుంచి ఆ మూలకు వెళతారు. ఇంతే అయితే ఎవరైనా చేస్తారేమో కానీ అసలు ప్రత్యేకత ఏంటో తెలుసా? కింద నోళ్లు తెరుచుకున్న మొసళ్లు ఉంటాయి. అటూ ఇటూ కదులుతూ ఆ ప్రాంతమంతా కలియబెడతాయి. వింటేనే దడ పుట్టించే ఈ సాహసం పేరు ‘క్రొకడైల్‌ క్రాసింగ్‌ జిప్‌లైన్‌’.

* అమెరికాలోని ఫ్లోరిడాలో ‘సెయింట్‌ అగస్టీన్‌ అలిగేటర్‌ ఫార్మ్‌ జూలాజికల్‌ పార్కు’లో ఉందిది.

* ఈ విన్యాసాలు గమ్మత్తుగా ఉంటాయి. ఏడెకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ప్రాంతం వందలాది మొసళ్లతో నిండి ఉంటుంది. భూమి నుంచి 60 అడుగుల ఎత్తులో వీటిపైన 11 తాళ్లతో విన్యాసాలు ఏర్పాటు చేశారు. ఒక్కో విన్యాసం ఒక్కోలా ఉంటుంది. సన్నని తాడు పట్టుకుని వెళ్లడం, చెక్కలతో ఏర్పాటు చేసిన చక్రాల బోర్డుపై పరుగులు తీయడం, తాళ్ల వంతెనపై నడవటం ఇలా రకరకాలుగా ఉంటాయి.

* కింద మొసళ్లు పాకుతూ ఉంటే, పై నుంచి ఈ విన్యాసాలు చేస్తుంటే చూసేవాళ్లకు పైప్రాణాలు పైనే పోయినట్టు ఉంటుంది.

* వామ్మో! పడిపోతే ఇంకేమైనా ఉందా? అంటే మరేం భయం లేదు. ఎందుకంటే పర్యవేక్షకులు సరైన జాగ్రత్తలు తీసుకుంటారు.

* ఈ సాహసాలతో పాటు పర్యటకులు ఇక్కడున్న మొసళ్లను చూస్తూ, వాటికి ఆహారం తినిపిస్తూ, వాటితో ఫొటోలు దిగుతూ సందడి చేస్తుంటారు.

* 1893 నుంచి ఈ పార్కు రకరకాల జాతుల మొసళ్లను ప్రదర్శనకు ఉంచుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని