అడుగుకో గడియారం! ఆసక్తికి అలారం!!

వందల ఏళ్ల క్రితం సమయం తెలుసుకోవడానికి వాడే సాధనమేంటో తెలుసా? మన ముత్తాతలు ఉపయోగించిన గడియారాల గురించి తెలుసా? వాచీ పుట్టిన దగ్గర్నించి ఇప్పటి వరకు ఎలా మార్పు చెందిందో చెప్పగలరా? ఆసక్తికరమైన ఈ...

Published : 21 Jun 2016 01:10 IST

అడుగుకో గడియారం! ఆసక్తికి అలారం!!

వందల ఏళ్ల క్రితం సమయం తెలుసుకోవడానికి వాడే సాధనమేంటో తెలుసా? మన ముత్తాతలు ఉపయోగించిన గడియారాల గురించి తెలుసా? వాచీ పుట్టిన దగ్గర్నించి ఇప్పటి వరకు ఎలా మార్పు చెందిందో చెప్పగలరా? ఆసక్తికరమైన ఈ వివరాలన్నింటినీ తెలుసుకోగలిగే చోటు ఒకటుంది. అదే ‘వియన్నెస్‌ క్లాక్‌ మ్యూజియం’. ఇది ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. దీన్నే ‘యుహ్రేన్‌ మ్యూజియం’ అని కూడా పిలుస్తారు.

* ఈ మ్యూజియంలో అడుగుపెట్టగానే బోలెడు రకాల గడియారాలు దర్శనమిస్తాయి. ఎప్పుడో 15వ శతాబ్దం నాటి గడియారాల దగ్గర్నించి ఇప్పటి తరం వాచీల వరకు అన్నీ వరుస ప్రకారం అమర్చిపెట్టారు.

* మూడంతస్తుల్లో ఉన్న ఈ మ్యూజియంలో దాదాపు వెయ్యికి పైగా వాచీలుంటాయి. వీటిలో పాకెట్‌ వాచ్‌, టేబుల్‌ క్లాక్‌, గోడ గడియారం, టవర్‌ క్లాక్‌, సన్‌డయల్స్‌, పిల్లర్‌ క్లాక్‌, కుకూ క్లాక్‌ ఇలా ఎన్నో రకాల గడియారాల్ని చూడొచ్చు.

* పెద్ద బీరువా అంత పరిమాణం ఉండే యంత్రాల్లాంటి గడియారాల దగ్గర్నించి చేతి వాచీ వరకు వివిధ పరిమాణాల్లో ఉంటాయి. వీటిలో కొన్ని రోజు, తేదీ, నెల, సంవత్సరం చూపించేవీ ఉన్నాయి.

* ముఖ్యంగా ఇందులో ఆకట్టుకునేది ఖగోళ గడియారం. 230 ఏళ్లనాటి అద్భుతమైన ఈ గడియారం 9999 సంవత్సరం వరకు కూడా ఆగకుండా పనిచేస్తూ సమయాన్ని కచ్చితంగా తెలుపుతుంది.

* ఈ మ్యూజియాన్ని 1921లో ప్రారంభించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని