టై పుట్టింది ఇక్కడే

జెండా: తెలుపు రంగు శాంతికి, నిజాయితీకి గుర్తు, ఎరుపు రంగు దృఢత్వానికి, ధైర్యానికి సూచిక, నీలం రంగు విధేయత, న్యాయానికి చిహ్నం. దేశ రాజధాని జాగ్రెబ్‌లో ‘బ్రోకెన్‌ రిలేషన్‌షిప్స్‌’ పేరిట ఓ వింత మ్యూజియం ఉంది. విడిపోయిన జంటలు తాము కలిసి ఉన్నప్పటి నాటి గుర్తుల్ని ఇందులో ఉంచుతారు.

Published : 26 Jun 2016 01:06 IST

టై పుట్టింది ఇక్కడే

రాజధాని: జాగ్రెబ్‌
జనాభా: 42,84,889
విస్తీర్ణం: 56,594 చదరపు కిలోమీటర్లు
భాష: క్రొయేషియన్‌
కరెన్సీ: కునా


 

జెండా: తెలుపు రంగు శాంతికి, నిజాయితీకి గుర్తు, ఎరుపు రంగు దృఢత్వానికి, ధైర్యానికి సూచిక, నీలం రంగు విధేయత, న్యాయానికి చిహ్నం.


 

* దేశ రాజధాని జాగ్రెబ్‌లో ‘బ్రోకెన్‌ రిలేషన్‌షిప్స్‌’ పేరిట ఓ వింత మ్యూజియం ఉంది. విడిపోయిన జంటలు తాము కలిసి ఉన్నప్పటి నాటి గుర్తుల్ని ఇందులో ఉంచుతారు.

* క్రొయేషియా దేశం మధ్య ఐరోపా, ఆగ్నేయ ఐరోపా, మధ్యధరా సముద్రాల కూడలిలో ఉంది. ఈ దేశం మొత్తంలో వెయ్యి ద్వీపాలున్నాయి. వీటిలో 50 దీవులు నివాసయోగ్యం కానివి.

* ఇది స్వతంత్ర దేశం.

* ప్రపంచంలోనే అతి చిన్న పట్టణం ఇక్కడే ఉంది. పేరు హమ్‌. ఇక్కడ 17 నుంచి 23 మంది మాత్రమే ఉంటారు.

* ఇక్కడ 16 ఏళ్లకు కూడా ఓటు వేసే హక్కు లభిస్తుంది. కానీ వారికి ఉద్యోగం ఉంటేనే!



 
 

 

* ఇక్కడ అయిదున్నర కిలోమీటర్ల పొడవైన స్టోన్‌ వాల్స్‌ కోట గోడను చూడ్డానికి పర్యటకులు ఎక్కువగా వస్తుంటారు.

* ఇక్కడుండే ‘కోపాకీ రిట్‌ నేచర్‌ పార్కు’ ఐరోపా మొత్తంలో అతిపెద్ద తడినేలల రక్షిత ప్రాంతం.


 

 

* హుందాతనానికి గుర్తుగా భావించే ‘టై’ని కనిపెట్టింది ఈ దేశంలోనే.

* ఇక్కడే ‘స్లావోల్‌జబ్‌ పెన్‌కల’ అనే ఆవిష్కర్త 1906లో బాల్‌పాయింట్‌ పెన్నును తయారు చేశారు.

* ప్రముఖ విద్యుత్తు ఉపకరణాల ఆవిష్కర్త నికోలా టెస్లా వూరు ఇక్కడే ఉంది. టెస్లా మ్యూజియంగా మలిచిన ఈయన ఇంటికి ఎందరో పర్యటకులు వస్తుంటారు.

 * మూడో వంతు అడవులే ఉన్నాయి.

 

* ఇక్కడి ‘బ్రాక్‌’ అనే దీవిలో ఉన్న ‘జ్లాట్నిరాట్‌’ బీచ్‌ వింతగా ఉంటుంది. గాలివాటాన్ని బట్టి ఇది రంగుల్నీ, ఆకారాన్నీ మార్చుకుంటూ ఉంటుంది.

* మన రుద్రమదేవి పాలన గురించి రాసిన నావికుడు మార్కోపోలో పుట్టింది క్రొయేషియాలోనే.

* ‘డాల్మేషియా కుక్క జాతి’ ఇక్కడిదే. ఇక్కడి డాల్మేషియా ప్రాంతంలో పుట్టింది కాబట్టి దీనికీ పేరొచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని