వాటర్‌ స్లైడ్‌ ఎక్కేద్దామా... జర్రు జర్రున జారేద్దామా!

నీటిలో ఆడుకోవడమంటే మీకెంతో ఇష్టం కదా? అయితే వెంటనే ఐర్లాండ్‌ బయల్దేరండి. అక్కడ ఓ వాటర్‌స్లైడ్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. దీని విశేషం ఏంటో తెలుసా? ప్రపంచంలోనే అతి ఎత్తయిన తేలియాడే వాటర్‌ స్లైడ్‌. ఈ మధ్యే గిన్నిస్‌ రికార్డు కూడా కొట్టింది.

Published : 29 Jun 2016 01:15 IST

వాటర్‌ స్లైడ్‌ ఎక్కేద్దామా...
జర్రు జర్రున జారేద్దామా!

నీటిలో ఆడుకోవడమంటే మీకెంతో ఇష్టం కదా? అయితే వెంటనే ఐర్లాండ్‌ బయల్దేరండి. అక్కడ ఓ వాటర్‌స్లైడ్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. దీని విశేషం ఏంటో తెలుసా? ప్రపంచంలోనే అతి ఎత్తయిన తేలియాడే వాటర్‌ స్లైడ్‌. ఈ మధ్యే గిన్నిస్‌ రికార్డు కూడా కొట్టింది.

ఐర్లాండ్‌లో అత్లోన్‌ అనే ప్రదేశంలోని లాగ్‌ రీ సరస్సులో నీటిలో ఆటలాడించే ఓపెద్ద పార్క్‌లాంటిది ఉంది.

నీటిపై తేలియాడుతూ ఉండే ఈ వాటర్‌ పార్కులో 42 అడుగుల ఎత్తుతో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ వాటర్‌ స్లైడ్‌ గురించే మనం చెప్పుకుంటుంట. దాదాపు నాలుగు అంతస్తుల భవనమంత ఎత్తు మీంచి జర్రుజర్రున జారుతూ, దభేల్‌మంటూ నీళ్లలోకి పడిపోతామన్నమాట. అలా జారేవారి కేరింతలతో అక్కడంతా భలే సందడిగా ఉంటుంది.

అసలా పార్కే నీటిపై తేలుతుందని చెప్పుకున్నాం కదా? ఇక అందులో రకరకాల వింత వింత ఆటలు బోలెడున్నాయి. ఎగిరిన కొద్దీ పైకి ఎగరేసే ట్రాంపోలిన్‌ రైడ్‌, జంపింగ్‌ కుషన్స్‌లాంటి బోలెడు సరదాలు ఎన్నో! మరైతే నాన్న దగ్గరకి వెళ్లి వెంటనే ఐర్లాండ్‌ తీసుకెళ్లమని అడగండి!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని